India Vs Sri Lanka World Cup 2023 Updates Toss and Playing 11: వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత్.. మరో విజయంపై కన్నేసింది. శ్రీలంకపై నేడు తలపడుతోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టేబుల్ టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. శ్రీలంక ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటి ముఖం పడుతుంది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించనుంది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.
"మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఛేజింగ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. గత కొన్ని మ్యాచ్‌లలో మా ఆటగాళ్లు సత్తా చాటారు. ఈరోజు కూడా అదే జోరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. జట్టులో ఒక మార్పు చేశా. దుషన్ హేమంత తుది జట్టులోకి వచ్చాడు.." అని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ తెలిపాడు.
"టాస్ గెలిచి ఉంటే మొదట బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లం. బ్యాటింగ్ చేయడానికి మంచి పిచ్. రాత్రి సమయంలో లైట్ల కింద బౌలింగ్ చేయడం మా పేసర్లకు సహకరిస్తుంది. సొంత గ్రౌండ్‌లో జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప విషయం. మా గత మ్యాచ్‌లలో ఆటతీరు గురించి ఆలోచించకుండా సరికొత్తగా ఆడాలి. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.." టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
తుది జట్లు ఇవే..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్, కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.
Also Read: Jee Main 2024 Registration: జీ మెయిన్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తు ఎలా
Also Read: Varun Tej Lavanya Tripathi Wedding: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఫొటోలు.. నెట్టింట వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి