India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు

IND vs SL 3rd T20 Highlights: శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విన్యాసాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. హైలెట్స్ చూస్తున్నామా.. లైవ్ చూస్తున్నామా అనేంతలా ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ విధ్వంసం కొనసాగింది. చివరి మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసి సిరీస్‌ను సొంతం చేసుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 06:47 AM IST
  • సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ
  • మూడో టీ20 మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో భారత్ విజయం
  • 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం
India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు

IND vs SL 3rd T20 Highlights: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పరుగుల సునామీ సృష్టించాడు. శ్రీలంక బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్లు ప్రేక్షకులు మారగా.. ప్రేక్షకులే ఫీల్డర్లు అయ్యారు. సూర్య సెంచరీతో చెలరేగగా.. బౌలర్లు కూడా రాణించడంతో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.

భారత్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్ శుభారంభం అందించారు. వీరిద్దరూ 4.5 ఓవర్లలో 44 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ తడబడింది. మెండిస్ 23, నిస్సాంక 15 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అవిష్క ఫెర్నాండో ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. ధనంజయ్ డిసిల్వా (22), చరిత్ అసలంక (19), కెప్టెన్ దసున్ షనక (23) పెద్దగా పరుగులు చేయలేదు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా చేతులెత్తేయడంతో  137 రన్స్‌కే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ తలో రెండు వికెట్లు తీశారు. 
 
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మంచి లయను అందుకుంటున్న సమయంలో త్రిపాఠి (16 బంతుల్లో 35) ఔట్ అవ్వడంతో శ్రీలంక బౌలర్ల సంబరపడిపోయారు. అయితే సూర్య క్రీజ్‌లోకి రాకతో వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లు అయింది. 

సూర్యకుమార్ యాదవ్ ఏ బౌలర్‌ను వదలకుండా నిర్ధాక్షిణ్యంగా షాట్ల్ ఆడాడు. గ్రౌండ్ నలుములాల సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో సెంచరీ. అవతలి ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ (46)తో మూడో వికెట్‌కు 111 పరుగులు జోడించాడు. హార్ధిక్ పాండ్యా (4) భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. చివర్లో సూర్యకు తోడు అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21) మెరవడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఈ విజయంతో కొత్త ఏడాదిలో తొలి సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్, అక్షర్ పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. 

Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  

Also Read: Money Saving Tips: డబ్బు పొదుపు చేసే మార్గాలు.. ఇలా చేస్తే మీ భవిష్యత్‌కు భరోసా

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News