Rahul Tripathi Stunning Catch: రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక చేతిలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 206 పరుగులు చేయగా.. అనంతరం టీమిండియా 8 వికెట్లకు 190 రన్స్ చేసింది. భారత్ తరఫున అక్షర్ పటేల్ సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. శ్రీలంక కెప్టెన్ దసున్ శానక ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి చేసిన ఓ పని అందరికీ నవ్వు తెప్పించింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సాంకా భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న త్రిపాఠి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే వెంటనే సంబరపడిపోతూ సిక్సర్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో అక్షర్ పటేల్‌కు దిమ్మతిరిగింది. ఔట్ కాదేమో సిక్సర్ అనుకుని సైలెంట్ అయిపోయాడు.
రాహుల్ త్రిపాఠి సిగ్నల్‌తో ఫీల్డ్ అంపైర్లకు కూడా క్యాచ్‌పై డౌట్ వచ్చింది. దీంతో థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్న రాహుల్ త్రిపాఠి సంబరాలు చేసుకునే క్రమంలోనే రెండు చేతులు పైకి ఎత్తాడు. దీంతో అక్షర్ పటేల్‌తో పాటు అంపైర్లు కూడా సిక్సర్ అని అనుకున్నారు. అయితే అక్షర్ వద్దకు హార్ధిక్ పాండ్యా వచ్చి సిక్స్ కాదని.. ఔట్ అని చెప్పాడు. దీంతో అక్షర్ మొఖంలో ఆనందం వెల్లివిరిసింది.
Rahul Tripathi making his presence feel in the 1st match itself. What a great catch to dismiss Pathum Nissanka.#INDvSL #RahulTripathi pic.twitter.com/Pv9SZjJu7Y
— Sunrisers Orange Army (@SunrisersOArmy) January 5, 2023
ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంక ఆకట్టుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ శనక 22 బంతుల్లో 56 (2 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కుశాల్ మెండిస్ 31 బంతుల్లో 52, నిసంక 33, అసలంక 37 పరుగులతో రాణించారు. చివరి ఆరు ఓవర్లలో శ్రీలకం ఏకంగా 83 పరుగులు రాబట్టుకోవడం విశేషం.
207 పరుగుల ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (2), శుభ్‌మాన్ గిల్ (5), రాహుల్ త్రిపాఠి (5), హార్ధిక్ పాండ్యా (12), దీపక్ హుడా (9) తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. దీంతో 57 పరుగులకే ఐదు వికెట్లు కష్టాల్లో పడగా.. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో గెలుపు ఆశలు రేపారు. ఎడపెడా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. కానీ చివర్లో సూర్యకుమార్ ఔట్ అవ్వడంతో ఓటమి ఖరారు అయింది.
Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా
Also Read: CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook