Wasim Jaffer - Virat Kohli: కోహ్లీని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన జాఫర్!!

తాజాగా ఓ ఆస్ట్రేలియన్‌ వెబ్‌ సైట్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్‌ జాఫర్‌ చురకలు అంటించి మరోసారి వార్తల్లో నిలిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 01:16 PM IST
  • కోహ్లీని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా
  • అదిరిపోయే పంచ్ ఇచ్చిన జాఫర్
  • తనదైన శైలిలో సెటైర్ వేసిన వసీమ్‌ జాఫర్‌
Wasim Jaffer - Virat Kohli: కోహ్లీని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన జాఫర్!!

Wasim Jaffer gives punch to Australian media for their dig at Virat Kohli batting form: టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్‌ జాఫర్‌ (Wasim Jaffer) సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతో కన్నా.. సోషల్ మీడియా ద్వారానే వసీమ్‌ పాపులర్ అయ్యాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనదైన శైలిలో ఫన్నీ మీమ్స్‌ పోస్టులు చేస్తుంటాడు. ఎవరైనా టీమిండియా, భారత ఆటగాళ్లపై ఏదైనా పోస్టులు పెడితే.. వాటికి తగ్గట్టుగా స్పందించడంలోనూ జాఫర్‌ది ప్రత్యేక శైలి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆస్ట్రేలియన్‌ వెబ్‌ సైట్‌ (Australian Media)కు సైతం జాఫర్‌ చురకలు అంటించి మరోసారి వార్తల్లో నిలిచాడు.

విషయంలోకి వెళితే... టీమిండియా టెస్టు కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) గత రెండేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. ఒక్కోసారి అర్ధశతకం చేరుకున్నా.. దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మార్చడంలో ఇబ్బందులు పడుతున్నాడు. 2019 నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన డే/నైట్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారి విరాట్ సెంచరీ చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ ఇప్పటివరకూ మరో సెంచరీ చేయలేదు. కోహ్లీ బ్యాట్ నుంచి శతకం రాక దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది. ఒక్కోసారి తక్కువ స్కోరుకు కూడా పరిమితం అయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అతడి బ్యాటింగ్‌ సగటు (Virat Kohli Form) కూడా ఈ మధ్య తగ్గింది.

Also Read: పార్శిళ్లలో పందెం కోళ్లు... సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు... ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

'7Cricket' అనే ఓ ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్‌ తాజాగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ సగటును ఆసీస్‌ పేసర్‌ మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc)తో పోల్చింది. 'స్టాట్‌ ఆఫ్‌ ది డే' అని కాప్షన్ ఇచ్చి.. 2019 నుంచి టెస్టుల్లో మిచెల్ స్టార్క్‌ సగటు 38.63, విరాట్ కోహ్లీ సగటు 37.17 ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ఇద్దరి ఫొటోలను ట్వీట్‌ చేసింది. ఈ ట్వీటుపై స్పందించిన వసీమ్‌ జాఫర్‌ నవ్వుతున్న ఎమోజీ జత చేసి.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. 'టీమిండియా యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైని (53.50) వన్డే కెరీర్‌ బ్యాటింగ్‌ సగటు.. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (43.34) కన్నా మెరుగ్గా ఉంది' అని రీట్వీట్‌ చేశాడు. వసీమ్‌ పంచ్ ఇవ్వడంతో ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్‌ మిన్నకుండిపోయింది. 

వసీమ్‌ జాఫర్‌ చేసిన ట్వీట్ (Wasim Jaffer Tweet) నెట్టింట వైరల్ అయింది. భారత అభిమానులు అయితే తెగ సంబరపడిపోతున్నారు. ఈ ట్వీటుపై లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.  ప్రస్తుతం దక్షిణాఫ్రికా (IND vs SA) పర్యటనలో ఉన్న విరాట్‌ కోహ్లీ.. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే మూడో టెస్టు (3rd Test)కు ముందు తిరిగి నెట్స్‌లో సాధన చేయడంతో.. మ్యాచ్‌కల్లా కోహ్లీ ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) సమక్షంలో విరాట్ సాధన చేస్తున్నాడు. 

Also Read: అక్కతో వనమా రాఘవకు అక్రమ సంబంధం.. సంచలనం రేపుతున్న నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News