IND vs SA: బౌండరీ ఇచ్చిన మయాంక్‌.. 5 పరుగులు సమర్పించుకున్న పుజారా! నిరాశలో విరాట్ కోహ్లీ!!

రిషబ్ పంత్, చేతేశ్వర్ పుజారా ఐదు పరుగులు.. మయాంక్‌ అగర్వాల్‌ మిస్ ఫీల్డింగ్‌పై విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో అయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 01:14 PM IST
  • మయాంక్‌ అగర్వాల్‌ మిస్ ఫీల్డింగ్‌
  • చేటేశ్వర్ పుజారా మిస్ ఫీల్డింగ్‌
  • నిరాశలో విరాట్ కోహ్లీ
IND vs SA: బౌండరీ ఇచ్చిన మయాంక్‌.. 5 పరుగులు సమర్పించుకున్న పుజారా! నిరాశలో విరాట్ కోహ్లీ!!

Virat Kohli frustrated after Mayank Agarwal, Cheteshwar Pujara's Miss Fielding: భారత్‌, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారుతోంది. రెండో రోజైన బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (9), చేటేశ్వర్ పుజారా (14) ఉన్నారు. ప్రొటీస్‌ బౌలర్లు మార్కో జాన్‌సెన్, కాగిసో రబాడ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. దాంతో ప్రస్తుతం టీమిండియా (Team India) 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టులో ఇప్పటివరకు బౌలర్ల, బ్యాటర్ల  ప్రదర్శన బాగానే ఉన్నా.. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా భారత్ అదనపు పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 5 పరుగులు పెనాల్టీ (5 Penalty Runs) పడిన విషయం తెలిసిందే. శార్దుల్‌ ఠాకూర్ వేసిన బంతిని తెంబా బవుమా ఆడగా.. బాల్ మొదటి స్లిప్‌ దిశగా దూసుకుపోయింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న చేతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara).. కుడి వైపునకు డైవ్ చేసి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో కీపర్‌ రిషబ్ పంత్ (Rishabh Pant) మధ్యలో వచ్చి క్యాచ్‌ అందుకోగా అదికాస్తా మిస్ అయింది. పుజారా చేతికి తగిలిన బంతి.. పంత్‌ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో ఐసీసీ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా జట్టుకు అంపైర్‌ 5 అదనపు పరుగులు ఇచ్చాడు.

Also Read: Rat Magawa Dies: గతేడాదే రిటైర్మంట్‌ తీసుకున్న 'హీరో' మూషికం మృతి.. ఘనంగా అంత్యక్రియలు!!

కీగన్ పీటర్సన్‌కు జస్ప్రీత్ బుమ్రా (Bumrah) బౌలింగ్‌ చేస్తున్నపుడు కూడా మరో మిస్ ఫీల్డింగ్ జరిగింది. పీటర్సన్‌ షాట్ ఆడగా.. బంతి బౌండరీ లైన్ దగ్గరకు దూసుకెళ్లింది. మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal) బంతి బౌండరీ చేరకుండా సులువుగా ఆపే పరిస్థితి ఉన్నా.. దాన్ని అందుకోవడంలో విఫలమయ్యాడు. బాల్‌ను అందుకున్నప్పటికీ బ్యాలన్స్‌ చేసుకోలేక బౌండరీ రోప్‌ను తాకడంతో అది బౌండరీగా మారింది. రెండు పరుగులు వచ్చే దగ్గర.. మరో రెండు రన్స్ అదనంగా వచ్చాయి. దీంతో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. మయాంక్‌ తీరుపై మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు. 

రిషబ్ పంత్, చేతేశ్వర్ పుజారా ఐదు పరుగులు.. మయాంక్‌ అగర్వాల్‌ మిస్ ఫీల్డింగ్‌ (Miss Fielding)కు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అందులో విరాట్ కోహ్లీ (Virat Kohli) అసహనం వ్యక్తం చేసిన దృశ్యాలు హైలెట్ అయ్యాయి. ఈ విషయం గురించి టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాట్లాడుతూ.. 'మయాంక్ ఈజీగా బంతిని వెనక్కి నెట్టి ఉండవచ్చు. కానీ అలా జరుగలేదు. కెప్టెన్‌ ఇలా అసహనానికి గురికావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు' అని పేర్కొన్నారు. 

Also Read: Malaika Arora - Arjun Kapoor: మరో స్టార్ కపుల్ బ్రేకప్.. షాకింగ్ కౌంటర్ ఇచ్చిన హీరో!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News