Ravi Shastri Playing XI: వెంకటేష్, కార్తీక్‌కు దక్కని చోటు.. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్టు ఇదే!

Ravi Shastri Names His India XI For 1st South Africa T20I. స్టార్ స్పోర్ట్స్ షో ‘గేమ్ ప్లాన్’లోని ఇంటరాక్షన్ సందర్భంగా మొదటి టీ20 కోసం టీమిండియా మాజీ ప్లేయర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 09:58 PM IST
  • వెంకటేష్, కార్తీక్‌కు దక్కని చోటు
  • దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్టు ఇదే
  • జూన్ 9న తొలి మ్యాచ్
Ravi Shastri Playing XI: వెంకటేష్, కార్తీక్‌కు దక్కని చోటు.. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్టు ఇదే!

IND vs SA, Ravi Shastri announce His Team India Playing 11 For 1st T20I vs South Africa: రెండు నెలలుగా ఐపీఎల్ 2022తో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్లు స్వల్ప విరామం అనంతరం అంతర్జాతీయ టీ20 ఆడేందుకు సిద్దమయ్యారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ టీమిండియా ఆడనుంది. జూన్ 9 నుంచి 19 వరకు టీ20 సిరీస్‌ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్‌లో పాల్గొనే ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు తాజాగా ఢిల్లీ చేరుకుంది. మరోవైపు భారతప్లేయ‌ర్లు ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. 

స్టార్ స్పోర్ట్స్ షో ‘గేమ్ ప్లాన్’లోని ఇంటరాక్షన్ సందర్భంగా మొదటి టీ20 కోసం టీమిండియా మాజీ ప్లేయర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. ఐపీఎల్ 2022లో భీకర ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను రవిశాస్త్రి తన జట్టులోకి తీసుకోలేదు. ఇక కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్‌, చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకున్నాడు. 

నాలుగవ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను, అయిదో స్థానంలో రిషబ్ పంత్‌ను, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యాను రవిశాస్త్రి తన జట్టులో ఎంచుకున్నాడు. హార్దిక్ కీలక ఆటగాడిగా పేర్కొన్నాడు. బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్‌లను శాస్త్రి తీసుకున్నాడు. మైదానాన్ని బట్టి అర్ష్‌దీప్ సింగ్ లేదా ఉమ్రాన్ మాలిక్‌లలో ఒకరిని తీసుకోవాలని చెప్పాడు. స్పెషలిస్టు బౌలర్‌గా హర్షల్ పటేల్‌ను ఎంచుకున్నాడు.

రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవన్: 
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్.

Also Read: Uttarakhand Accident: చార్‌ధామ్‌ యాత్రలో విషాదం..బస్సు బోల్తా పడి 22 మంది మృతి..!

Also Read: Amala Paul Hot Pics: ఎత్తి చూపిస్తున్న అమలా పాల్.. చూస్తే తట్టుకోవడం కష్టమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News