IND Vs SA: మెరిసిన కుల్దీప్ యాదవ్‌.. 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్‌!

South Africa all-out for 99 runs after Kuldeep Yadav takes 4 wickets. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ చెలరేగడంతో మూడో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్‌ అయింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 11, 2022, 05:08 PM IST
  • మెరిసిన కుల్దీప్ యాదవ్‌
  • 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్‌
  • షహబాజ్‌ 2, సుందర్‌ 2, సిరాజ్ 2
IND Vs SA: మెరిసిన కుల్దీప్ యాదవ్‌.. 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్‌!

South Africa all-out for 99 runs after Kuldeep Yadav takes 4 wickets: సిరీస్ కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత బౌలర్లు సత్తాచాటారు. మూడో వన్డే మ్యాచ్‌లో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ నాలుగు వికెట్లతో చెలరేగిపోయాడు. కుల్దీప్ సహా షహబాజ్‌ 2, సుందర్‌ 2, సిరాజ్ 2 వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్‌ అయింది. దాంతో భారత్ ముందు 100 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెన్రిక్ క్లాసెన్ (34) చేసిన పరుగులే టాప్ స్కోర్. స్టార్ బ్యాటర్లు విఫలమవడంతో సఫారీ జట్టు కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. జానెమన్ మలన్ (15)ను మొహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా.. క్వింటన్ డీకాక్ (6)ను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన రీజా హెండ్రిక్స్ (3), ఎయిడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. సిరాజ్, షహబాజ్‌ వరుసగా వికెట్లు తీయడంతో కీలక వికెట్స్ కోల్పోయిన దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇన్నింగ్స్ చివర్లో మార్కో జాన్సెన్ (14) ఆటతీరు చూస్తే దక్షిణాఫ్రికా కనీసం 100 పరుగులైనా చేస్తుందనిపించింది. అయితే కుల్దీప్ యాదవ్ ఆ అవకాశం ఇవ్వలేదు. తన స్పిన్ మాయాజాలం చూపిస్తూ టెయిలెండర్లను వరుసపెట్టి పెవిలియన్ చేర్చాడు. దాంతో ప్రొటీస్ కథ 99 పరుగులకే ముగిసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్, సుందర్, షహబాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

Also Read: Rahul Koli Dies: ఆస్కార్‌ రేసులో ఉన్న 'ఛెల్లో షో' సినిమా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి!

Also Read: Roger Binny BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ.. కార్యదర్శి జై షానే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News