IND vs SA: దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్.. వైస్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌!

Sanju Samson is likely to be the vice-captain for India vs South Africa. వికెట్‌ కీపర్‌ శాంసన్‌ భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 27, 2022, 01:41 PM IST
  • భారత్ vs దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌
  • దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్
  • వైస్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌
IND vs SA: దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్.. వైస్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌!

Sanju Samson is likely to be the vice-captain for India vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌కు సిద్దమైన టీమిండియాకు కేరళలో నిరసన సెగ తగిలింది. సోమవారం మధ్యాహ్నం టీమిండియా హైదరాబాద్ నుంచి తిరువనంతపురం చేరగా.. అక్కడ అభిమానుల నుంచి భారత ఆటగాళ్లకు ఊహించని షాక్ తగిలింది. టీ20 ప్రపంచకప్‌ 2022లో చోటు దక్కని కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మద్దతుగా అతని అభిమానులు రచ్చరచ్చ చేశారు. బాగా ఆడుతున్న సంజూకు మెగా టోర్నీలో చోటు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసను తెలిపారు.

తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారత ఆటగాళ్లు బయటకు రాగానే.. 'సంజూ, సంజూ' అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీమ్ బస్ వెంబడి సంజూ శాంసన్‌ ఫాన్స్ పరుగెడుతూ రచ్చరచ్చ చేశారు. ఇది చూసిన టీమిండియా ప్లేయర్స్ షాక్ అయ్యారు. ఆర్ అశ్విన్, సూర్యకుమార్ యాదవ్.. సంజూ ఫోటోను తమ మొబైల్ ఫోన్స్‌లలో చూపించి నిరసకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇక దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లోనూ ఈ నిరసన కొనసాగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ అభిమానులకు ఓ శుభవార్త. వికెట్‌ కీపర్‌ శాంసన్‌ భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బుధవారం బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2022కి ఎంపికయిన ఆటగాళ్లందరికీ ఈ సిరీస్‌లో బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథ్య బాధ్యతలు సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేపట్టే అవకాశం ఉంది. ఇక వైస్ కెప్టెన్‌గా శాంసన్‌ బాధ్యతలు నిర్వహించనున్నాడు. 

స్వదేశంలో న్యూజిలాండ్‌-ఏతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో రాణించిన భారత ఆటగాళ్లను దక్షిణాఫ్రికా సిరీస్‌కు బీసీసీఐ సెలక్టర్లు ఎంపికచేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ తదితరులు దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. వన్డే సిరీస్ (అక్టోబరు 6) జరగనుంది. 

Also Read: Rashmika Mandanna Hot Pics: రష్మిక మందన్న క్లీవేజ్ షో.. గాగ్రాలో గుబులు రేపుతోందిగా!
Also Read: Sanjay Dutt in Mahesh Babu film: మహేష్ బాబు సినిమాలో సంజయ్ దత్ విలనిజం ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News