IND vs PAK: భారత్‌తో పాకిస్తాన్ పోరు.. వైరల్ అవుతోన్న పాక్‌ పేసర్ షహీన్‌ అఫ్రిది ట్వీట్‌!

Pakistan Pacer Shaheen Afridi  warns India ahead of T20 World Cup 2022 .పాకిస్తాన్ పేసర్ షహీన్‌ షా అఫ్రిది చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 8, 2022, 02:37 PM IST
  • భారత్‌తో పాకిస్తాన్ పోరు
  • వైరల్ అవుతోన్న పాక్‌ పేసర్ అఫ్రిది ట్వీట్‌
  • ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నా
IND vs PAK: భారత్‌తో పాకిస్తాన్ పోరు.. వైరల్ అవుతోన్న పాక్‌ పేసర్ షహీన్‌ అఫ్రిది ట్వీట్‌!

Pakistan Pacer Shaheen Afridi Cryptic Warning To India ahead of T20 World Cup 2022: అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2022 ఆరంభం కానుంది. అక్టోబర్ 23న దాయాది దేశాలు భారత్‌, పాకిస్తాన్ ఢీ కొట్టనున్నాయి. ఇండో-పాక్ కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతుండవంతో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఈ మ్యాచుకు సంబందించిన టికెట్స్ నిమిషాల వ్యవధిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మ్యాచ్ నేపథ్యంలో పాక్‌ ఆటగాళ్లు తమ మాటలతో కవ్వింపులకు దిగుతున్నారు. 

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగే మెల్‌బోర్న్ మైదానం తనకు సొంత మైదానం లాంటిదని, అక్కడ తన బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదని పాక్ ఫాస్ట్‌ బౌలర్‌ హారిస్‌ రవుఫ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ మరో పేసర్ షహీన్‌ షా అఫ్రిది చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందమైన లొకేషన్‌లో దిగిన తన ఫొటోను షహీన్‌ షేర్ చేస్తూ.. ‘తుపాను ముందు ప్రశాంతత’ అని కాప్షన్ ఇచ్చాడు. దాంతో భారత్‌తో పోరుకు షహీన్‌ సిద్దమే అంటూ కొందరు కామెంట్లు చేశారు.

గాయం కారణంగా ఆసియా కప్‌ 2022 షహీన్‌ షా అఫ్రిది ఆడని విషయం తెలిసిందే. అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు మ్యాచుల టీ20ల సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యాడు. ఈ సమయంలో శస్త్రచికిత్స కోసం అఫ్రిది సొంతంగా ఖర్చులను వెచ్చించాల్సి వచ్చిందని, పీసీబీ ఎలాంటి సహకారం అందించలేదని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవలే లండన్‌లో చికిత్స చేయించుకున్న అతడు ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నాడు. 

భారత్‌తో మ్యాచ్‌కు షహీన్ షా అఫ్రిది సిద్ధంగా ఉన్నాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజా తాజాగా ప్రకటించాడు. 'షహీన్‌ అఫ్రిదితో మాట్లాడా. చికిత్స అనంతరం తను గొప్పగా ఫీలవుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం 90 శాతం ఫిట్‌గా పరిగెత్తుతున్నాడు. బౌలింగ్ కూడా చేస్తున్నాడు. భారత్‌తో మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని షహీన్ నాతో చెప్పాడు’ అని రమీజ్ రజా తెలిపాడు. అఫ్రిది ఫిట్‌నెస్ సాధిస్తే పాక్ జట్టుకు పెద్ద సానుకూలంగా మారనుంది. 

Also Read: పరుగులు చేస్తున్నా.. భారత జట్టులో చోటు రావట్లేదు! యువ ఓపెనర్‌ అసహనం

Also Read: Samantha Ruth Prabhu : వెనక్కి తగ్గా ఓడిపోలేదు.. సమంత పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News