IND vs PAK: వైరల్ వీడియో.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఎంసీజీ స్టేడియం!

MCG Gets Ready for India vs Pakistan match.  టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచుకు ఎంసీజీ సిద్ధమవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 7, 2022, 07:59 PM IST
  • వైరల్ వీడియో
  • భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఎంసీజీ
  • హాట్ కేకుల్లా అమ్ముడయిపోయిన టికెట్స్
IND vs PAK: వైరల్ వీడియో.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఎంసీజీ స్టేడియం!

MCG Gets Ready for India vs Pakistan match: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఉన్న వైరం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో దాయాది దేశాల మధ్య క్రికెట్ యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతున్నాయి. దాంతో ఇండో, పాక్ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. టీవీ, ఓటీటీ వ్యూయర్‌షిప్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. టీ20 ప్రపంచకప్‌ 2022లో మరోసారి బద్దలు కానున్నాయి. 

అక్టోబర్ 23వ తేదీన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. 1,00,024 మంది కూర్చునే వీలున్న ఎంసీజీ స్టేడియంలో 80,000 టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మేశారు. మిగతా టిక్కెట్లను కూడా త్వరలోనే సేల్‌లో ఉంచుతారని తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంసీజీ స్టేడియం ముస్తాబవుతోంది. కొన్ని రోజుల క్రితమే ఎంసీజీ మైదానంలో ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. దాంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోను ఎంసీజీ తాజాగా విడుదల చేసింది. 'తొమ్మిది రోజుల క్రితం ఎంసీజీ మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఈ మైదానం వేసవికి క్రికెట్‌కు సిద్ధంగా ఉంది' అని పేర్కొంది. 

Also Read: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు!

Also Read: క్యా డాన్స్ హై మామ.. ఈ జపాన్ అమ్మాయిల కాలా చష్మా డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News