IND vs PAK: సాధారణ మ్యాచ్‌లాగే భారత్‌తో తలపడతాం.. ఫలితం మా చేతుల్లో లేదు: బాబర్‌ ఆజామ్‌

Babar Azam about India vs Pakistan Asia Cup 2022 Clash. టీమిండియాతో మ్యాచ్ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ అన్నాడు  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 13, 2022, 10:47 AM IST
  • 28న మెగా మ్యాచ్
  • సాధారణ మ్యాచ్‌లాగే భారత్‌తో తలపడతాం
  • ఫలితం మా చేతుల్లో లేదు
IND vs PAK: సాధారణ మ్యాచ్‌లాగే భారత్‌తో తలపడతాం.. ఫలితం మా చేతుల్లో లేదు: బాబర్‌ ఆజామ్‌

Babar Azam about India vs Pakistan Asia Cup 2022 Clash: ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు వారాల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆగస్టు 27న ఆసియా కప్ ఆరంభం కానుండగా.. 28న మెగా మ్యాచ్ జరగనుంది. దాయాదీ దేశాలు అయిన భారత్, పాకిస్థాన్ మెగా మ్యాచ్‌లో ఢీ కొట్టనున్నాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండడంతో.. ఇండో-పాక్ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

భారత్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమిండియాతో మ్యాచ్ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుందన్నాడు. 'సాధారణ మ్యాచ్‌లాగే భారత్‌తో తలపడతాం. అయితే టీమిండియాతో మ్యాచ్ అంటే కచ్చితంగా ఒత్తిడి అనేది భిన్నంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆడినట్లుగా ఆడడానికి ప్రయత్నిస్తాం. కేవలం మా ధ్యాస ఆట మీదే పెడతాం. జట్టు మీద నమ్మకంతో ఉన్నాం. మా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. ప్రయత్నమే మన చేతుల్లో ఉంటుంది కానీ ఫలితం మాత్రం కాదు. ఉత్తమమైన ప్రదర్శన ఫలితాలను ఇస్తుంది' అని బాబర్‌ అన్నాడు. 

టీ20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయిన టీమిండియా చాలా ఏళ్ళ తర్వాత పాక్ చేతిలో ఓడిపోయింది. ఆగష్టు 28న ఆసియా కప్‌ 2022లో పాక్‌ను భారత్‌ ఢీకొంటుంది. భారత్, పాకిస్తాన్ జట్లు సూపర్‌-4 దశకు చేరితే.. అక్కడ మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇక ఫైనల్‌కు వెళ్తే దాయాది జట్లు మళ్లీ పోటీపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో 13 సార్లు తలపడితే.. భారత్‌ ఏడు మ్యాచులు గెలిస్తే, పాకిస్తాన్‌ ఐదు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

Also Read: VVS Laxman Coach: బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్సీ తర్వాత మరో మార్పు!

Also Read: Nayanthara: ఇంకా హనీమూన్ మూడ్ లోనే నయనతార-విగ్నేష్.. ఆ దేశానికి జంప్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News