Rohit Sharma T20I Record: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. 'ఒకే ఒక్కడు'!

IND vs PAK, Rohit Sharma breaks Martin Guptill's T20I Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు బాదిన తొలి ఆటగాడిగా స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ నిలిచాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 29, 2022, 11:26 AM IST
  • ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ
  • 'ఒకే ఒక్కడు' రోహిత్‌ శర్మ
  • నాలుగు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు
Rohit Sharma T20I Record: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. 'ఒకే ఒక్కడు'!

IND vs PAK, Rohit Sharma breaks Martin Guptill's T20I Record: టీమిండియా కెప్టెన్‌, స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ సీనియర్ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ను అధిగమించి హిట్‌మ్యాన్ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఆసియా కప్‌ 2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఈ ఘనతను అందుకున్నాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా ప్రస్తుతం రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 133 మ్యాచులలో 3499 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 118. మార్టిన్‌ గప్టిల్‌ 121 మ్యాచులలో 3497 రన్స్ చేశాడు. గప్టిల్‌ 2 శతకాలు, 20 అర్ధ శతకాలు బాదాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (3341) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆసియా కప్‌ 2022లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్యా (3/25), భువనేశ్వర్‌ కుమార్ (4/26) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బాబర్ సేన 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. మొహ్మద్ రిజ్వాన్‌ (43; 42 బంతుల్లో 4×4, 1×6) ఒక్కడే పోరాడాడు. లక్ష్య ఛేదనలో భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6), రవీంద్ర జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్‌ పాండ్యా (33 నాటౌట్‌; 17 బంతుల్లో 4×4, 1×6) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 

Also Read: భారత్‌-పాక్ టీఆర్‌పీ రేటింగ్స్ అదుర్స్.. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ రికార్డులు బ్రేక్!

Also Read: Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌.. ఈసారి ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News