Harbhajan on Dinesh Karthik: 'రిషబ్ పంత్‌ను కాదని.. దినేష్ కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమే'

IND vs PAK, Asia Cup 2022: Harbhajan Singh on Dinesh Karthik. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను కాదని సీనియర్ కీపర్ దినేష్‌ కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమే అని హార్భజన్‌ సింగ్‌ అన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 30, 2022, 12:43 PM IST
  • రిషబ్ పంత్‌ను కాదని
  • దినేష్ కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమే
  • వికెట్ల వెనకాల మూడు క్యాచులు
Harbhajan on Dinesh Karthik: 'రిషబ్ పంత్‌ను కాదని.. దినేష్ కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమే'

IND vs PAK, Asia Cup 2022, Harbhajan Singh on Dinesh Karthik: ఆసియా కప్‌ 2022లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంటంగా సాగిన మ్యాచులో ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో 148 రన్స్ చేసి గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. 

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కాదని సీనియర్ కీపర్ దినేష్‌ కార్తీక్‌కు టీమ్ మేనేజేమెంట్‌ చోటు కల్పించింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరి కొం‍తమంది విమర్శిస్తున్నారు. తాజాగా భారత మాజీ స్పిన్నర్‌ హార్భజన్‌ సింగ్‌ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. పంత్‌ను కాదని కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమే అని భజ్జి అన్నారు.

ఓ మీడియాతో హార్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ... 'రిషబ్ పంత్ మంచి ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. టెస్ట్ మరియు వన్డేలలో చాలా బాగా ఆడుతున్నాడు. కానీ పొట్టి ఫార్మాట్‌లో అంతగా ఆకట్టు కోలేకపోయాడు. దినేష్‌ కార్తీక్‌ ఇటీవలి కాలంలో బాగా ఆడుతున్నాడు. అతని గ్రాఫ్ పైకి వెళ్తోంది. అటువంటి ఆటగాడిని బెంచ్‌పై ఉంచడం వల్ల ప్రయోజనం లేదు. కార్తీక్ ఆడాల్సిన సమయం వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ను కాదని కార్తీక్‌కు తుది జట్టులో చోటు ఇవ్వడం సరైన నిర్ణయం' అని అన్నారు. 

'రిషబ్‌ పంత్‌ యువ ఆటగాడు. అతడికి ఇంకా చాలా సమయం ఉంది. దినేష్ కార్తీక్‌ ఇంకో 2-3 ఏళ్లు మాత్రమే క్రికెట్‌ ఆడే అవకాశం ఉంది. కాబట్టి డీకే అందుబాటులో ఉన్నప్పడే సద్వినియోగం చేసుకోవాలి. టీ20ల్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందాడు. లోయర్‌ ఆర్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా,  దినేష్ కార్తీక్ వంటి ఫినిషర్లు క్రీజులో ఉంటే.. ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పడతాయి' అని హార్భజన్‌ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో డీకే వికెట్ల వెనకాల మూడు క్యాచులు అందుకున్నాడు. బ్యాటింగ్లో ఒక బంతి ఎదుర్కొని ఓ కీలక రన్ తీశాడు.

Also Read: విరాట్ సాధారణ ఆటగాడిగా కనిపిస్తున్నాడు.. కోహ్లీ ఆడింది గొప్ప ఇన్నింగ్స్‌ కాదు: పాక్ ప్లేయర్ 

Also Read: సిక్సులను సునాయాసంగా కొట్టే హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News