Deepak Chahar BCCI: ఆ వార్తల్లో నిజం లేదు.. దీపక్‌ చహర్‌ జట్టుతోనే ఉన్నాడు: బీసీసీఐ

IND vs PAK, Asia Cup 2022: BCCI about Deepak Chahar Injury. టీమిండియా బౌలర్ దీపక్‌ చహర్‌ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 25, 2022, 07:47 PM IST
  • ఆ వార్తల్లో నిజం లేదు
  • దీపక్‌ చహర్‌ జట్టుతోనే ఉన్నాడు
  • దుబాయ్‌లో ప్రాక్టీస్‌ కూడా
Deepak Chahar BCCI: ఆ వార్తల్లో నిజం లేదు.. దీపక్‌ చహర్‌ జట్టుతోనే ఉన్నాడు: బీసీసీఐ

BCCI official says Deepak Chahar not injured: టీమిండియా స్వింగ్ బౌలర్ దీపక్‌ చహర్‌ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. గాయంతో ఆసియా కప్‌ 2022కు చహర్‌ దూరమయ్యాడని, అతని స్థానంలో కుల్దీప్‌ సేన్‌ను స్లాండ్‌ బై ప్లేయర్‌గా తీసుకున్నట్లు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన బీసీసీఐ.. నెట్టింట వచ్చే వార్తలు అన్ని అవాస్తవాలు అని స్పష్టం చేసింది. చహర్‌ భారత జట్టుతోనే ఉన్నాడని పేర్కొంది.

'పేసర్ దీపక్‌ చహర్‌ గాయపడినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. చహర్‌ ఆసియా కప్‌ 2022లో ఆడుతాడు. దుబాయ్‌లో ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్దీప్‌ సేన్‌ను కేవలం నెట్‌ బౌలర్‌గానే తీసుకున్నాయి. టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్‌ చేయడానికి మాత్రమే సేన్‌ను ఎంపిక చేశాం. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. భారత జట్టులోకి రావడానికి ఇంకా సమయం ఉంది' అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.

గత ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో దీపక్ చహార్ గాయపడ్డాడు. దాంతో ఐపీఎల్ 2022 సహా దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే వన్డే సిరీసులో దీపక్ ఆడాడు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి తన స్వింగ్ ప్రతాపం చూపాడు. ఇక ఆసియా కప్‌ 2022కు ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. దీపక్‌ స్టాండ్‌ బై ఆటగాడిగా ఉన్నా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లకి ఎక్కువ అనుభవం లేకపోవడం మనోడికి కలిసి రానుంది. 

Also Read: Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా! అస్సలు ఊహించరు

Also Read: Liger OTT: ఓటీటీలో విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News