Ind Vs NZ Live Score Updates: సిరీస్‌ను సమం చేయాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ తడపడింది. కివీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయస్ అయ్యర్ (49), వాషింగ్టన్ సుందర్ (51) రాణించగా.. మిగిలిన వారందరూ బ్యాట్లెత్తేశారు. కివీస్ బౌలర్లలో మిల్నే, మిచెల్ తలో మూడు వికెట్లు తీయగా.. సౌథీ 2, ఫెర్గ్యూసన్, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు. 220 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవ్వగా.. టాస్ గెలిచిన కివీస్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (28), శుభ్‌మన్ గిల్ (13)లను కివీస్ బౌలర్లు బాగా ఇబ్బంది పెట్టారు. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకుంటూ చెలరేగిపోయారు. వీరిద్దరిని ఆడమ్ మిల్నే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 13 ఓవర్లలో 55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత రిషబ్ పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (6) కూడా నిరాశపరిచారు.
మరో ఎండ్‌లో క్రీజ్‌లో పాతుకుపోయిన శ్రేయాస్ అయ్యర్ (59 బంతుల్లో 49) ఒక పరుగు దూరంలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంజూ శాంసన్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ హుడా (12) కూడా విఫలమమయ్యాడు. దీపక్ చాహర్ (12) కూడా తక్కువ స్కోరుకే డగౌట్‌కు చేరడంతో టీమిండియా 36.3 ఓవర్లలో 170 రన్స్‌కే ఏడు వికెట్లు కోల్పోయింది.
మొదటి వన్డేలో దూకుడు బ్యాటింగ్‌తో ఆదుకున్న వాషింగ్టన్ సుందర్.. మరోసారి న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 64 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తన వన్డే కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాహల్ (8)తో కలిసి స్కోరు బోర్డు 200 దాటించాడు. చివరికి 47.3 ఓవర్లలో 219 పరుగులకు పరితమైంది.
Also Read: Vijay Devarakonda ED: 'లైగర్' చిక్కుల్లో విజయ్ దేవరకొండ.. ఈడీ విచారణకు హాజరు?
Also Read: మళ్లీ మాట తప్పిన రామ్ చరణ్.. అలాంటి సినిమా చేయనంటూనే రీమేక్స్ పై కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook