IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. సంజూకి తప్పని నిరాశ! ఓపెనర్లుగా పంత్, ఇషాన్

IND vs NZ 2nd T20I: New Zealand have won the toss and have opted to field vs India. భారత్, న్యూజిలాండ్‌ జట్లు మరికొద్దిసేపట్లో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 20, 2022, 01:45 PM IST
  • భారత్, న్యూజిలాండ్‌ రెండో టీ20
  • టీమిండియాదే బ్యాటింగ్
  • సంజూకి తప్పని నిరాశ
IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. సంజూకి తప్పని నిరాశ! ఓపెనర్లుగా పంత్, ఇషాన్

IND vs NZ 2nd T20I Playing 11 is Out: భారత్, న్యూజిలాండ్‌ జట్లు మరికొద్దిసేపట్లో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆడమ్ మిల్నే మినహా మిగతా వారందరూ టీ20 ప్రపంచకప్‌ 2022లో ఆడిన వారే అని కేన్ మామ తెలిపాడు. మరోవైపు సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చిన నేపథ్యంలో యువకులతో భారత్ బరిలోకి దిగుతోంది. యువ ప్లేయర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.   

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ వర్షార్పణమైన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన రెండు మ్యాచ్‌లను ఎవరు గెలిస్తే.. వారిదే పొట్టి సిరీస్‌. మౌంట్ మాంగనుయ్‌ వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ ప్రారంభమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలోని యువ భారత్‌ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీస్‌లో ఓటమితో నిరాశ చెందిన ఈ రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తున్నాయి. 

తుది జట్లు:
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రిషబ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, మొహ్మద్ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్. 
న్యూజిలాండ్‌: కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్‌, డారిల్ మిచెల్‌, జేమ్స్ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, టీమ్ సౌథీ, ఇష్‌ సోథీ, ఆడమ్‌ మిల్నె, లాకి ఫెర్గూసన్‌.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్‌ అకౌంట్ రీ ఓపెన్.. కానీ..!  

Also Read: IND vs NZ: ఐపీఎల్లో సత్తా చాటిన ఈ ప్లేయర్ టీ20ల్లో అరంగేట్రానికి రెడీ   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News