IND vs NED: నెదర్లాండ్స్‌తో భారత్‌ ఢీ.. టీమిండియా జోరుకు బ్రేకులు! ఆందోళనలో ఫాన్స్

Rain might play a spoilsport India vs Netherlands T20 World Cup 2022 match. భారత్, నెదర్లాండ్స్ టీ20 మ్యాచ్‌కు వర్షం అడ్డుగా మారదని నిన్నటి వరకు అనుకున్నా.. నేటి పరిస్థితులు పూర్తిగా మారాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 27, 2022, 11:26 AM IST
  • నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ
  • టీమిండియా జోరుకు బ్రేకులు
  • ఆందోళనలో ఫాన్స్
IND vs NED: నెదర్లాండ్స్‌తో భారత్‌ ఢీ.. టీమిండియా జోరుకు బ్రేకులు! ఆందోళనలో ఫాన్స్

Rain Threat for India vs Netherlands T20 World Cup 2022 match at Sydney: ఉత్కంఠ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత్ టీ20 ప్రపంచకప్‌ 2022లో ఘనంగా బోణీ కొట్టిన విషయం తెలిసిందే. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న రోహిత్ సేన నేడు రెండో మ్యాచ్‌కు రెడీ అయింది. క్వాలిఫయింగ్‌ టోర్నీలో సత్తాచాటి సూపర్‌ 12కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌తో మరికొద్ది సేపట్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఈ మ్యాచుకు వేదిక. గురువారం మూడు మ్యాచ్‌లు ఉండడంతో.. షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 1:30కు మొదలు కావాల్సిన మ్యాచ్‌.. 12:30కే ఆరంభం కానుంది. 

పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా జోరుకు బ్రేకులు పడేలా ఉన్నాయి. ఇందుకు కారణం వర్షం. టీ20 ప్రపంచకప్ 2022 మొదలైనప్పటి నుంచి వర్షం వెంటాడుతూనే ఉంది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు కాగా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచులో ఫలితం రాలేదు. ఇక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌ చేతిలో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ప్రతి రోజూ టీ20 ప్రపంచకప్‌కు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉండడంతో సంచనాలు నమోదవుతున్నాయి. 

భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డుగా మారదని నిన్నటి వరకు అనుకున్నా.. నేటి పరిస్థితులు పూర్తిగా మారాయి. రాత్రి నుంచి మ్యాచ్‌కు వేదికైన సిడ్నీ నగరంలో అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల్లో మ్యాచ్ మొదలు కావాల్సి ఉన్న నేపథ్యంలో..  సిడ్నీ నగరం మొత్తం దట్టంగా మేఘాలు అలముకున్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. దాంతో మ్యాచ్ సజావుగా జరగడం అనుమానంగానే మారింది. దాంతో విషయం తెలిసిన ఫాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. 

సిడ్నీలో జరుగుతున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం కొంతసేపు ఆటంకం కలిగించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు తేలికపాటి జల్లులు పడ్డాయి. అయితే మ్యాచ్ ఆరంభ సమయానికి తగ్గింది. దాంతో మ్యాచ్ యధాతథంగా ఆరంభమైంది. వర్షం ఎప్పుడు పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అందుకే భారత్ ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ఛేదించే సమయంలో అయినా మంచి రన్ రేట్ మెయిటైన్ చేయాల్సి ఉంది. లేదంటే ఇంగ్లండ్ మాదిరి షాక్ తగిలే అవకాశం ఉంది. 

Also Read: India vs Netherlands: మరి కాసేపట్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు.. వీళ్లపైనే అందరి కళ్లు  

Also Read: Nayanthara Surrogacy Report : నయనతార సరోగసి వివాదం.. హడావిడి చేసిన ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇదే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News