IND vs ENG Under 19 World Cup Final Preview: అండర్ 19 ప్రపంచకప్ 2022 ఫైనల్ సమరానికి వేళయింది. వెస్టిండీస్‌లోని అంటిగ్వా వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తుది పోరులో తలపడనున్నాయి. ఇప్పటికే భారత్ నాలుగుసార్లు టైటిల్ గెలవగా.. ఐదవ టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవకపోవడంతో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
శనివారం (ఫిబ్రవరి 5) సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అండర్ 19 ప్రపంచకప్ 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు టాస్ పడనుండగా.. 6.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్స్ ఛానెల్‌లో ప్రసారం కానుంది. లైవ్ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం కానుంది.
టీమిండియా ఓపెనర్ ఓపెనర్ రఘువంశీ మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. రఘువంశీతో పాటు మరో ఓపెనర్ హర్నూర్ క్రీజులో నిలబడితే మంచి ఆరంభం దక్కనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న వైస్ కెప్టెన్ షేక్ రషీద్, కెప్టెన్ యశ్ ధుల్ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ్ బవా, రాజ్ వర్ధన్, నిశాంత్ సింధు, దినేశ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్లు రాజ్‌వర్ధన్, నిశాంత్, రాజ్ బంతితోనూ అదరగొడుతున్నారు. స్వింగ్‌తో రవికుమార్ ఆకట్టుకుంటుండగా.. విక్కీ స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. కౌశల్ కూడా నిలకడగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. మొత్తానికి భారత్ పటిష్టంగా ఉంది.
ఇంగ్లండ్ కూడా టీమిండియాకు తక్కువదేమీ కాదు. కెప్టెన్ టామ్ ప్రెస్ట్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్ జాకోబ్ బెతెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. జార్జ్ బెల్, అలెక్స్ పరుగులు చేస్తున్నారు. బౌలింగ్‌లో పేసర్ జోషువా బాయ్‌డెన్, స్పిన్నర్ రెహాన్ అహ్మద్ కీలకం కానున్నారు. ఇక చివరి మ్యాచులో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి రెహాన్ పట్ల భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో విజయం కోసం భారత్ శ్రమించాల్సి వస్తుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, యష్ ధుల్ (కెప్టెన్), నిశాంత్ సింధు, రాజ్ బావా, కౌశల్ తాంబే, దినేష్ బానా (వికెట్ కీపర్), రాజ్వర్ధన్ హంగర్గేకర్, విక్కీ ఓస్త్వాల్, రవి కుమార్.
ఇంగ్లండ్: జార్జ్ థామస్, జాకబ్ బెథెల్, టామ్ పెర్స్ట్ (కెప్టెన్), జేమ్స్ రెవ్, విలియం లక్స్టన్, జార్జ్ బెల్, రెహాన్ అహ్మద్, అలెక్స్ హోర్టన్ (వికెట్ కీపర్), జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్‌వాల్, జాషువా బోయ్డెన్.
Also Read: Vasantha Panchami 2022: నేడు వసంత పంచమి.. బాసర సరస్వతీ ఆలయంకు పోటెత్తిన భక్తులు!!
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook