Richa Ghosh Stunning Catch Video: టీమిండియా పురుషుల జట్టులో మాజీ కేప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే ఇప్పటి మహిళల టీమిండియా జట్టులోనూ ఒక క్రికెటర్ తయారవుతున్నారా అంటే అవుననే అంటున్నారు క్రికెట్ ప్రియులు. ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనకాల నిలబడి కీపింగ్ చేస్తోంటే.. వేటకు వచ్చిన సింహం వేటాడటానికి నిలబడినట్టుగా ఉండేది. కళ్లు మూసి తెరిసేలోగా క్షణకాలంలో మెరుపు వేగంతో బ్యాట్స్ మెన్ ని స్టంపౌట్ చేయడంలో మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతే ఎవరైనా. ధోనీ స్టంపౌట్ చేయడం మాత్రమే కాదు.. గాల్లోకి డైవ్ కొట్టి క్యాచ్ పట్టినా కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంలో దిట్ట.
మహేంద్ర సింగ్ ధోనిని ఇప్పుడు మనం అలా టీమిండియా తరపున క్రీజులోనైతే చూడలేం కానీ.. మహిళల జట్టులో వికెట్ కీపర్ రిచా ఘోష్ పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్ మాత్రం క్రికెట్ ప్రియులకు ధోనిని గుర్తుకుతెస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ బి దశలో ఇండియా vs ఇంగ్లాండ్ జట్ల మధ్య ఒక ముఖ్యమైన మ్యాచ్‌లో రిచా ఘోష్ కుడివైపునకు డైవ్ చేసి ఒంటి చేత్తో ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టింది. రిచా ఘోష్ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్ లైవ్ మ్యాచ్ చూస్తోన్న స్పెక్టేటర్స్‌కి ఆడియెన్స్‌కి మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసింది.
చూశారు కదా.. మహేంద్ర సింగ్ తరహాలోనే రిచా ఘోష్ గాల్లోకి ఎగిరిపట్టిన ఈ క్యాచ్ ఆమెకు క్రికెట్ ప్రియుల నుంచి ఎనలేని ప్రశంసలను తీసుకురావడమే కాదు.. భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ని కూడా సంపాదించిపెట్టింది. రేణుకా సింగ్ థాకూర్ బౌలింగ్‌లో రిచా ఘోష్ పట్టిన ఈ క్యాచ్‌తో డానియెల్ వాత్ గోల్డెన్ డకౌట్‌తో పెవిలియన్ బాట పట్టింది.
రేణుకా సింగ్ థాకూర్ సైతం తన బౌలింగ్‌తో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరుస్తోంది. రేణుకా సింగ్ థాకూర్, రిచా ఘోష్ ఇద్దరూ త్వరలోనే జరగనున్న మొట్టమొదటి ఉమెన్స్ ప్రిమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు. దీంతో రేణుకా సింగ్ బౌలింగ్‌లో రిచా ఘోష్ స్టన్నింగ్ క్యాచ్ పట్టి డానియెల్‌ని డిస్మిస్ చేయడంతో అభిమానులు అందరూ ఆర్సీబీ ఆర్సీబీ అని అరుస్తూ వారిని ఎంకరేజ్ చేయసాగారు. సోషల్ మీడియాలోనూ ఇదే రియాక్షన్ కనిపిస్తోంది.
Lady MS Dhoni: టీమిండియా జట్టులో లేడీ మహేంద్ర సింగ్ ధోనీగా రిచా ఘోష్.. వైరల్ వీడియో