T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఇంటికే.. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే!

Mithali Raj Makes Bold Prediction on T20 World Cup Final. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కూడా టీ20 ప్రపంచకప్‌ 2022పై స్పందించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 2, 2022, 11:16 AM IST
  • ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఇంటికే
  • టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే
  • బంగ్లాదేశ్‌తో భారత్ కీలక మ్యాచ్‌
T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఇంటికే.. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే!

Mithali Raj predicts India and New Zealand Play T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 సూపర్‌ 12 మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నా.. ఇంకా సెమీస్‌ బెర్త్‌లు ఖారారు కాలేదు. గ్రూపు 1 నుంచి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు సెమీస్‌ రేసులో ఉన్నాయి. మరోవైపు గ్రూపు 2 నుంచి దక్షిణాఫ్రికా, భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్ కోసం పోటీ పడుతున్నాయి. మరో రెండు రోజుల్లో సెమీస్ బెర్త్ ఖరారు అవుతాయి. 

టీ20 ప్రపంచకప్‌ 2022 ఆరంభం నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌ జట్లు సెమీస్ చేరుతాయని చాలామంది మాజీలు అంచనా వేశారు. తాజాగా భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కూడా టీ20 ప్రపంచకప్‌ 2022పై స్పందించారు. ఫైనల్‌కు చేరే జట్లను ఆమె అంచనా వేశారు. ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడే అవకాశం ఉందని మిథాలీ తెలిపారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పడుతాయని మిథాలీ పరోక్షంగా చెప్పారు. 

స్టార్‌ స్పోర్ట్స్‌తో మిథాలీ రాజ్ మాట్లాడుతూ... 'నా అంచనా ప్రకారం టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్‌కు గ్రూపు 2 నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా చేరుకుంటాయి. గ్రూపు 1 నుంచి న్యూజిలాండ్‌ తప్పనిసరిగా సెమీ ఫైనల్ చేరుతుంది. మరో స్థానం కోసం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. అయితే ఫైనల్లో మాత్రం భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతాయి' అని అంచనా వేశారు. మిథాలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. 

గ్రూపు 2లో ఉన్న భారత్ మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆడిలైడ్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ కీలక మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే.. సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read: Actress Rambha Live Video : మొదటి సారి లైవ్‌లోకి వచ్చా.. అందరికీ రుణపడి ఉంటా.. రంభ ఎమోషనల్ వీడియో

Also Read: India Vs Bangladesh Dream 11 Team: బంగ్లాతో భారత్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News