IND Vs BAN: బంగ్లాదేశ్‌తో టీమిండియా పోరు.. స్పిన్నర్లకు పండగే.. పిచ్ రిపోర్ట్ ఇదే..!

IND vs BAN 1st Odi Match: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు భారత్ జట్టు రెడీ అయింది. మీర్పూర్‌ వేదికగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా..? రేపు వాతావరణం ఎలా ఉండనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 07:13 PM IST
IND Vs BAN: బంగ్లాదేశ్‌తో టీమిండియా పోరు.. స్పిన్నర్లకు పండగే.. పిచ్ రిపోర్ట్ ఇదే..!

IND vs BAN 1st Odi Match: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. రెండు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం ఉదయం 11:30 గంటలకు మీర్పూర్‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వర్షం కురుస్తుండటంతో క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇటీవల టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో సగం మ్యాచ్‌లు వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి వరుణుడు విలన్‌గా మారకూడదని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

తొలి వన్డేలో వాతావరణం ఇలా..

మూడు వన్టేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ మీర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ రోజున మీర్పూర్ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. శనివారం వర్షం కురిసినా.. మ్యాచ్‌ సమయానికి వర్షం కురిసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రత దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢాకాలో వాతావరణం చల్లగా ఉంది. మంచు ఎక్కువగా ఉంటుంది. అభిమానులు మొత్తం మ్యాచ్‌ని వీక్షించవచ్చు.

షేర్-ఎ-బంగ్లా స్టేడియం పిచ్ రిపోర్ట్

షేరే బంగ్లా స్టేడియంలో చివరి వన్డే మ్యాచ్ 2021 మేలో జరిగింది. ఇక్కడ 113 వన్డేలు జరగ్గా.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 53 మ్యాచ్‌లు గెలుపొందగా.. ఛేజింగ్ చేసిన జట్టు 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. షేర్ బంగ్లా స్టేడియంలోని పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. ఈ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో టీమిండియానే విజయం సాధించింది. 

వన్డే సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంతి, యాసిర్ అలీ, ఆసిఫ్ హొస్సేన్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్, షకీబ్ అల్ హసన్, అనముల్ హక్, లిటన్ దాస్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), నూరుల్ హసన్ (వికెట్ కీపర్), ఇబాదత్ హుస్సేన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, నాసం అహ్మద్, తస్కిన్ అహ్మద్.    

Also Read: Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. తొక్కుడే తొక్కుడు.. వీడియో వైరల్  

Also Read: Health Tips: మొబైల్ లేదా టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News