Border Gavaskar Trophy 2023: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్‌లో ఎంతో క్రేజ్ ఉన్న సిరీస్. భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడినప్పుడల్లా.. మైదానంలో కొన్ని చిరస్మరణీయ క్షణాలు, అద్భుతమైన ప్రదర్శనలు అలా నిలిచిపోతాయి. ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ వరుసగా నంబర్ వన్, టు స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో మొదటి టెస్టులో రెండు దిగ్గజ జట్లు తలపడనున్నాయి. ఎవరిపై ఎవరు పైచేయి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓ ఐదుగురు ఆటగాళ్లపై ఓ మాత్రం లుక్కేయండి. వీరి ఆటతీరుపైనే అందరి కళ్లు ఫోకస్ కాబోతున్నాయి.
విరాట్ కోహ్లీ
భారత మాజీ కెప్టెన్, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. గత కొంత కాలంగా టెస్టు క్రికెట్‌లో కోహ్లీ పరుగులు చేయకపోయినా.. ఇటీవలె అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కింగ్ కోహ్లీ ఆస్ట్రేలియాతో మైదానంలోకి దిగినప్పుడు తన పాత స్టైల్‌లోనే కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాపై 20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 48.05 సగటుతో 1682 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
రవీంద్ర జడేజా
మోకాలి గాయం కారణంగా గతేడాది ఆగస్ట్ నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. రాబోయే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో పునరాగమనం చేయాలనుకుంటున్నాడు. మిడిలార్డర్‌లో స్థిరత్వం అందించాలంటే జడ్డూ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా కీలకం. బంతి, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించగలడు. ఆస్ట్రేలియాపై జడేజా 12 టెస్టుల్లో 18.85 సగటుతో 63 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్లు తీశాడు.
శుభ్‌మన్ గిల్
ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో మార్మోగిపోతున్న పేరు శుభ్‌మన్ గిల్. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్న ఈ యంగ్ ప్లేయర్ ఆసీస్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. గత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఈ యువ బ్యాట్స్‌మన్ మూడు మ్యాచ్‌లలో 51.80 సగటుతో 259 పరుగులు చేశాడు.
స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియాకు అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌లలో స్టీవ్ స్మిత్ ఒకడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండడంతో ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 231 పరుగులు చేశాడు. స్మిత్‌ను ఔట్ చేయడం టీమిండియా బౌలర్లకు అంత సులభం కాదు. టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో 8647 పరుగులు చేశాడు స్మిత్.
నాథన్ లియోన్
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ భారత పిచ్‌లపై చాలా ప్రభావం చూపగలడు. ఈ 35 ఏళ్ల స్పిన్నర్ టెస్ట్ సిరీస్ మొత్తంలో భారత బ్యాట్స్‌మెన్‌కు పెద్ద ముప్పుగా మారవచ్చు. లియాన్ 115 టెస్టు మ్యాచ్‌ల్లో 460 వికెట్లు తీశాడు. అలాగే టెస్టు క్రికెట్‌లో కింగ్ కోహ్లీని ఏడుసార్లు ఔట్ చేశాడు. కోహ్లీ-లియోన్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
Also Read: Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డికి జగన్ సర్కార్ చెక్.. భద్రత తగ్గింపు
Also Read: Nellore Mayor Sravanthi: నెల్లూరులో వైసీపీకి మరో షాక్.. కోటంరెడ్డికే జై కొట్టిన మేయర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook