IND vs AUS: భారత గడ్డపై ఆస్ట్రేలియా ఓపెన్ కామెరూన్ గ్రీన్ విధ్వంసం కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌కు పని చెప్పాడు. క్రీజులోకి రాగానే వరుసగా ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. మొహాలీ ఇన్నింగ్స్‌ను హైదరాబాద్ ఉప్పల్ మైదానంలోనూ కొనసాగించాడు. మూడో టీ20లో ఆది నుంచే చెలరేగిపోయాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. తద్వారా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీమిండియాపై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకముందు ఈరికార్డు వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ పేరుపై ఉంది. 2016లో లాడర్ హిల్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో చార్లెస్ 20 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో విరవిహారం చేసిన గ్రీన్..మొత్తంగా భువనేశ్వర్ బౌలింగ్ ఔట్ అయ్యాడు.
మొహాలీ మ్యాచ్‌లో 30 బంతుల్లో గ్రీన్ 61 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. నాగ్‌పూర్‌లో 8 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. హైదరాబాద్ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు.
Also read:Bangladesh Accident: బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం..24 మంది మృతి..పలువురు గల్లంతు..!
Also read:Chakali Ilamma: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook