India vs Australia Highlights: ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన భారత్.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రింకూ సింగ్ (46), యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32), జీతేశ్ శర్మ (35) రాణించారు. 175 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 రన్స్‌కే పరిమితమైంది. దీంతో భారత్ 20 రన్స్ తేడాతో గెలిచింది. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించాడు. మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను కట్టడిచేశాడు. అక్షర్‌కే మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరి, ఐదో టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్దేడియం వేదికగా ఆదివారం జరగనుంది.
టీమిండియా విధించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (16 బంతుల్లో 31, 5 ఫోర్లు, ఒక సిక్స్) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జోష్ ఫిలిప్ (8)ను బిష్టోయ్ ఔట్ చేసి ఆసీస్‌ను తొలి దెబ్బ తీశాడు. కాసేటికే హెడ్‌ను అక్షర్ ఔట్ చేశాడు. బెన్ మెక్ డెర్మాట్ (19), ఆరోన్ హార్డీ (8), టిమ్ డేవిడ్ (19), షార్ట్ (22) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ (23 బంతుల్లో 36 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువ అయిపోయింది. చివర్లో భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ 154 పరుగులకే ఆగిపోయింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ మంచి పునాది వేశారు. రుతురాజ్ యాంకర్ రో ప్లేల్ చేయగా.. జైస్వాల్ (28 బంతుల్లో 37, 6 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడాడు. అయితే జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ (8), సూర్యకుమార్ యాదవ్ (1) తక్కువ వ్యవధిలోనే ఔట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. రుతురాజ్‌తో కలిసి రింకూ సింగ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రుతురాజ్ (28 బంతుల్లో 32, 3 ఫోర్లు, ఒక సిక్స్) ఔట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన జీతేశ్ శర్మ.. తన తొలి మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 35 రన్స్ చేశాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి దూకుడుగా ఆడాడు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది.
Also Read: Animal Movie Leaked: యానిమల్ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఫుల్‌మూవీ
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి