India vs Australia 3rd T20 Dream11 and Pitch Report: ఆసీస్‌పై వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియ వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది. భారత్ తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది. రేపు జరిగే మూడో టీ20లోనూ విజయం సాధిస్తే.. సిరీస్ భారత్ సొంతమవుతుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కంగారూలు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..
పిచ్ రిపోర్ట్ ఇలా..
బర్సపరా క్రికెట్ స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉంటుంది. అయితే గతేడాది అక్టోబర్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. రేపటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగే అవకాశం లేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. రాత్రి 10:30 గంటలకు ఆట ముగిసే సమయానికి ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..
తేదీ: మంగళవారం, నవంబర్ 28, 2023
సమయం: సాయంత్రం 7 గంటలకు
వేదిక: బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
స్ట్రీమింగ్: Sports18 నెట్వర్క్, డీడీ ఫ్రీ డిష్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్టోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా: మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, జోస్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా.
IND vs AUS డ్రీమ్11 టీమ్..
కీపర్: ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, జోస్ ఇంగ్లిస్
ఆల్‌రౌండర్లు: గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్
బౌలర్లు: కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్టోయ్.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook