India Vs Australia Playing 11 and Score Update: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌లో తలపడుతోంది. మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ మెరుపులతో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. నేడు అదే జోరును కంటిన్యూ చేసి.. సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలని చూస్తోంది. అటు ఆసీస్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌లో గెలుపు రుచి చూడాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉండడంతో ఆసీస్ ఛేజింగ్‌కు మొగ్గుచూపింది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది. టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. ఆసీస్ రెండు మార్పులు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా తుది జట్టులోకి వచ్చారు.
"మేము బౌలింగ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మంచు వస్తుంది. వికెట్ బాగానే ఉంది. పిచ్ మంచిగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో మేము బాగానే ఆడాం. కానీ భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. కొన్ని విషయాల్లో మరింత మెరుగావ్వాలి. బెహ్రెన్‌డార్ఫ్ స్థానంలో ఆడమ్ జంపా, ఆరోన్ హార్డీ స్థానంలో మాక్స్‌వెల్ జట్టులోకి వచ్చారు." అని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు.
"నిన్న రాత్రి కురిసిన మంచు చూసి ఛేజింగ్ చేయాలని అనుకున్నాం. ఇప్పుడు మొదట బ్యాటింగ్ చేసి.. మంచి స్కోరు చేయాలి. లక్ష్యాన్ని కాపాడుకోవడం సవాల్ మారనుంది. చివరి గేమ్ మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆటగాళ్లు అద్భుతంగా ఉన్నారు. మేము అదే ఊపును కొనసాగిస్తాం. కెప్టెన్సీ అనేది ఒక కొత్త సవాలు, బాధ్యత. నేను దానిని ఆనందిస్తున్నాను. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం.." అని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.
Also Read: IPL 2024 Trading Window Live Updates: ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు ఇవే.. ఏ జట్టులో ఏ ప్లేయర్ అంటే..?
Also Read: విదేశీ పెళ్లిళ్లు వద్దు.. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించేనా..!?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి