IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో తొలి క్రికెటర్‌గా..!

IND vs AUS 1st T20I: Rohit Sharma eye on Martin Guptills Sixes Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ శర్మ ముందుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 20, 2022, 06:21 PM IST
  • ఆస్ట్రేలియాతో తొలి టీ20
  • అరుదైన రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌
  • టీ20 ఫార్మాట్‌లో తొలి క్రికెటర్‌గా..
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో తొలి క్రికెటర్‌గా..!

IND vs AUS 1st T20I, Rohit Sharma eye on Martin Guptills Sixes Record: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. మొహాలీ వేదికగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆసీస్‌తో పోటీ అయినప్పటికీ భారత జట్టు ఫోకస్ మొత్తం అక్టోబర్‌ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2022 పైనే ఉంది. టీమ్ కాంబినేషన్స్ సెట్ చేసుకోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది మంచి అవకాశం. 

తొలి టీ20 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మను ఓ అరుదైన ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ ముందుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఒక్క సిక్స్‌ కొడితే.. న్యూజిలాండ్‌ వెటరన్ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ రికార్డును సమం చేస్తాడు. రెండు సిక్సర్లు బాదితే గప్టిల్‌ను అధిగమించి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు.

మార్టిన్ గప్టిల్‌ ఇప్పటి వరకు 121 అంతర్జాతీయ టీ20లు ఆడి 172 సిక్స్‌లు బాదాడు. రోహిత్‌ శర్మ 136 టీ20లు ఆడి 171 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌ బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ (124), ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ (120), ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (117) టాప్‌ 5లో కొనసాగుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ ఇప్పటి వరకు 323 ఫోర్లు, 171 సిక్సర్ల సాయంతో 3620 రన్స్ బాదాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 28 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

Also Read: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు: చిరంజీవి

Also Read: కాటేయడానికి దూసుకొచ్చిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ఒట్టి చేతులతో ఎలా కంట్రోల్ చేశాడో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News