Ind Vs Aus: షమీ దెబ్బకు వార్నర్ మైండ్‌బ్లాక్.. గాల్లో ఎగిరిపడ్డ స్టంప్స్

Ind Vs Aus 1st Day Updates: ఆసీస్‌తో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. నాగ్‌పూర్‌లో రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పేస్ పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు షాకిచ్చారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 12:27 PM IST
Ind Vs Aus: షమీ దెబ్బకు వార్నర్ మైండ్‌బ్లాక్.. గాల్లో ఎగిరిపడ్డ స్టంప్స్

 Ind Vs Aus 1st Day Updates: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. డబ్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమిండియా ఈ సిరీస్‌ను కచ్చితంగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదట్లోనే భారత బౌలర్లను కంగారూ జట్టును కంగారెత్తించారు. ఓపెనర్లు ఇద్దరిని వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించారు. ఉస్మాన్ ఖావాజా (1)ను మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్యూ చేసి శుభారంభం అందించాడు. అనంతరం డేవిడ్ వార్నర్ (1)ను మహ్మద్ షమీ అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. షమీ వేసిన బాల్‌కు స్టంప్స్ గాల్లో ఎగిరిపడ్డాయి. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహ్మద్ షమీ వేసిన ఈ బంతికి డేవిడ్ వార్నర్‌కు సమాధానమే లేదు. బంతి నేరుగా స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో వార్నర్ ఆశ్చర్యపోయి.. పిచ్ వైపు చూసుకుంటు పెవిలియన్‌ బాటపట్టాడు. తొలి 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం మార్నస్ లబుషేన్ (47), స్టీవ్ స్మిత్ (19) జట్టును ఆదుకున్నారు. లంచ్ సమయానికి 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.

 

ఇక ఈ మ్యాచ్‌లో ద్వారా సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఎప్పటి నుంచో జట్టుతోపాటే ఉన్న కేఎస్ భరత్ అవకాశం కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరమవ్వడంతో కేఎస్ భరత్‌కు లైన్ క్లియర్ అయింది. వికెట్‌ కీపర్‌గా భరత్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఆంధ్ర రంజీ ప్లేయర్‌ అయిన శ్రీకర్‌ భరత్.. టెస్టుల్లో అదరగొట్టాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా గాయం కారణంగా చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా రీఎంట్రీ ఇచ్చాడు.

 

తొలి టెస్టుకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Also Read: UP Murder Case: పెళ్లికి నిరాకరించడంతో యువకుడిని చంపేసిన ప్రియురాలు.. ఎలా దొరికిపోయారంటే..?     

Also Read: ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల హవా.. నంబర్ టు ప్లేస్‌కు హార్ధిక్ పాండ్యా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

  

Trending News