ICC WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్, Team Indiaలో ఆందోళన పెంచుతున్న కివీస్ రికార్డులు

ICC WTC Final India vs New Zealand: ఐసీసీ నిర్వహిస్తోన్న మేజర్ టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ లలో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా, కివీస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 9, 2021, 11:36 AM IST
ICC WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్, Team Indiaలో ఆందోళన పెంచుతున్న కివీస్ రికార్డులు

ICC WTC Final India vs New Zealand: ఐసీసీ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శన చేసే జట్లలో టీం ఇండియా ఒకటి. అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారిగా నిర్వహిస్తోన్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్ 18న ప్రారంభం కానుంది. అయితే న్యూజిలాండ్‌పై ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు మెరుగైన రికార్డులు లేవు.

ఐసీసీ నిర్వహిస్తోన్న మేజర్ టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ లలో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 2003 వన్డే ప్రపంచ కప్‌లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా, కివీస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌పై భారత్ (Team India) నెగ్గడం అదే చివరిసారి. మాస్టర్ మైండ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో, విరాట్ కోహ్లీ సారథ్యంలో న్యూజిలాండ్‌పై భారత్ విజయాలు దక్కించుకోలేకపోయింది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్‌ సెమీఫైనల్స్‌లో అనూహ్యంగా కివీస్ చేతిలో ఓటమితో మేజర్ ఈవెంట్ నుంచి భారత్ నిష్క్రమించడం తెలిసిందే.

Also Read: IPL 2021: ఐపీఎల్ ఫేజ్-2పై అడ్డంకులు తొలగిపోలేదా, BCCIకి అంత టైమ్ ఇస్తారా

2007 టీ20 వరల్డ్ కప్
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదిగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాలుగు వికెట్లు తీసిన డానియెల్ వెటోరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

2016 T20 వరల్డ్ కప్ 
భారత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అయితే ఆతిథ్య New Zealand స్పిన్ త్రయం నాథన్ మెకల్ల్, మిచెట్ శాంట్నర్ మరియు ఇష్ సోధి కలిసి 9 వికెట్లు పడగొట్టడంతో టీమ్ ఇండియా కేవలం 79 పరుగులకు పరితమై 47 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.

Also Read: Yuzvendra Chahal Trolls: భార్యతో వద్దు బ్రో, ద గ్రేట్ ఖలీతో ట్రై చేయాలంటూ యుజువేంద్ర చాహల్‌పై సెటైర్లు

2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్
టీమిండియాను తీవ్రంగా నిరాశపరిచిన మ్యాచ్‌లలో ఇది ఒకటి. రోహిత్ శర్మ వరుస శతకాలు బాదుతూ ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించి జట్టును సెమీఫైనల్ చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (95 బంతుల్లో 65), రాస్ టేలర్ (90 బంతుల్లో 74) అర్ధశతకాలతో రాణించగా, నికోల్స్ (28) పరవాలేదనిపించాడు. కివీస్ 239 పరుగులు చేసింది. వర్షం పడటంతో మ్యాచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 5 పరుగులకే 3 వికెట్లు 24 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోగా రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77 పరుగులు) రాణించడంతో విజయానికి చేరువైనా లక్ష్యాన్ని చేరలేదు. 18 పరుగుల దూరంలో నిలిచి ఫైనల్ చేరుకునే అవకాశాన్ని విరాట్ కోహ్లీ సేన కోల్పోయింది. జూన్ 18 నుంచి (WTC Final Reserve Day) ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.

Also Read: IPL 2021 Final Match: ఐపీఎల్ సీజన్ 14 ఫైనల్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా, భారత్‌లో పండగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News