World Cup 2023 Closing Ceremony: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్ బరిలో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ప్రపంచకప్ వేడుకల్ని క్రికెట్ ప్రపంచానికి గుర్తుండిపోయేలా ఐసీసీ, బీసీసీఐ ప్లాన్ చేస్తున్నాయి. దాదాపు 12 వందల ద్రోన్‌లు స్డేడియంపై విహరించనున్నాయి. ముగింపు వేడుకలు ఎలా ఉండబోతున్నాయో ఓసారి పరిశీలిద్దాం..
ప్రపంచకప్ 2023 ఫైనల్ కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో అద్భుతమైన ఈ వేడుకను అందరూ గుర్తుంచుకునేలా వివిధ రకాల ప్రదర్శనలు జరగనున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా అంతకంటే ముందే వివిధ రకాల ప్రదర్శనలు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని లేదా డిప్యూటీ ప్రధాని హాజరుకానున్నారు. వీరితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి ఇతరులు పాల్గొనబోతున్నారు.
మద్యాహ్నం 12.30 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందంతో 10 నిమిషాలు అద్భుతమైన వైమానిక ప్రదర్శన కన్నులవిందు చేయనుంది. ఈ ప్రదర్శన ఫ్లైట్ కమాండర్, డిప్యూటీ టీమ్ లీడర్ వింగ్ కమాండర్ సిద్ధేష్ కార్తీక్ నేతృత్వంలో జరగబోతోంది.
మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ టీమ్‌తో దిల్ జష్న్ బోలే సంగీత కార్యక్రమం వీనులవిందు చేయనుంది. 500కు పైగా డ్యాన్సర్లు స్డేడియంలో కేసరియా, దేవా దేవా, లెహరాదో వంటి పాటలు ప్రదర్శించనున్నారు. ప్రపంచకప్ విజేత పేరును లేజర్ షోతో ప్రదర్శించడం ద్వారా వేడుకలు ముగియనున్నాయి. మరోవైపు మొత్తం కార్యక్రమాన్ని వివిధ కోణాల్లో లైవ్ ఇచ్చేందుకు 12 వందలకు పైగా ద్రోన్‌లు తిరగనున్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ వీక్షించేందుకు విన్నింగ్ టీమ్ కెప్టెన్లకు ఆహ్వానం అందింది. 1975 కప్ విజేత క్లైవ్ లాయిడ్ నుంచి 2019 కప్ విజేత ఇయాన్ మోర్గాన్ వరకూ అందరూ హాజరుకానున్నారు. పాకిస్తాన్ అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాత్రం జైలులో ఉన్నందున హాజరుకావడం లేదు.
Also read: World Cup 2023 Final: ఆస్ట్రేలియాతో తుది సమరం అంత ఈజీ కాదు, జాగ్రత్త అంటున్న మాజీ క్రికెటర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook