/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

ICC Men's T20 world cup: 2024 పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌కు (T20 world cup) వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ట్రోఫీ కోసం మెుత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. మెుత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు జరపనున్నారు. ప్రపంచకప్ షెడ్యూల్ ఫిక్స్ కానప్పటికీ.. టోర్నీ తేదీలను ఐసీసీ (ICC) ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే 17 టీమ్ లు అర్హత సాధించాయి. మిగతా మూడు జట్లు ఏవనేది త్వరలో తేలిపోనుంది. దీని కోసం ప్రస్తుతం క్వాలిఫయింగ్‌ మ్యాచులు జరుగుతున్నాయి. 

ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లను పది స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ఇందులో అమెరికాలోని డల్లాస్‌ (గ్రాండ్‌ ప్రైరీ స్టేడియం), మోరిస్‌విల్లే (చర్చ్‌ స్ట్రీట్‌ పార్క్‌), న్యూయార్క్‌ (వాన్‌ కార్ట్‌ల్యాండ్‌ పార్క్‌)తోపాటు ఫ్లోరిడాలోని లౌడర్‌హిల్‌ స్టేడియం ఉన్నాయి. అయితే ఈ స్టేడియాలకు ఇంకా ఇంటర్నేషనల్ హోదా ప్రకటించాల్సి ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలకు అంతార్జాతీయ హోదా తప్పనిసరి. ప్రస్తుతం ఈ స్టేడియాల్లో ఉన్న సదుపాయాలను  ఐసీసీ బృందం  పరిశీలిస్తుంది. 

టోర్నీలో పాల్గొనబోయే మెుత్తం 20 జట్లును నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లకు స్థానం కల్పించనున్నారు. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. మళ్లీ వాటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. వీటిలో టాప్ ప్లేస్ లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడుతాయి. భార‌త్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ద‌క్షిణాఫ్రికా, శ్రీ‌లంక‌, వెస్టిండీస్‌, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌, నెద‌ర్లాండ్స్, అమెరికా జ‌ట్లు పోటీల‌కు అర్హత సాధించాయి. ఐర్లండ్‌, పపువా న్యూగినియా, స్కాట్‌లాండ్‌లు రీసెంట్ గా క్వాలిపై అయ్యాయి. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: India vs West Indies: సిరీస్‌పై గురిపెట్టిన టీమిండియా.. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
ICC Men's T20 World Cup 2024 will be held from June 4 To 30
News Source: 
Home Title: 

ఈ సారి టీ20 వరల్డ్‌ కప్‌లో 20 జట్లు.. మెగా టోర్నీ ప్రారంభం ఎప్పుడంటే?

T20 world cup 2024: ఈ సారి టీ20 వరల్డ్‌ కప్‌లో 20 జట్లు.. మెగా టోర్నీ ప్రారంభం ఎప్పుడంటే?
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఈ సారి టీ20 వరల్డ్‌ కప్‌లో 20 జట్లు.. మెగా టోర్నీ ప్రారంభం ఎప్పుడంటే?
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, July 29, 2023 - 12:24
Request Count: 
46
Is Breaking News: 
No
Word Count: 
238