జీవిత లక్ష్యాన్ని వెల్లడించిన స్టీవ్ స్మిత్.. పెద్ద కోరికనే!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ తన చిరకాల వాంఛ ఏంటో చెప్పేశాడు. అది అంత తేలికకాదని క్రీడా పండితులు చెబుతున్నారు.

Last Updated : Apr 8, 2020, 12:18 PM IST
జీవిత లక్ష్యాన్ని వెల్లడించిన స్టీవ్ స్మిత్.. పెద్ద కోరికనే!

ప్రస్తుత తరం అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన చిరకాల వాంఛ ఏంటో చెప్పేశాడు. రిటైరయ్యేలోగా భారత గడ్డమీద టెస్టు సిరీస్ విజయాన్ని ఆస్వాదించాలని ఉందన్నాడు. భారత్‌లో ఆస్ట్రేలియా చివరిసారిగా 2005లో టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకుంది. గత 15 ఏళ్లలో ఆసీస్ మరో టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేయలేకపోయింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు స్పిన్ విభాగం కన్సల్టెంట్ ఇష్ సోధితో ఫేస్‌బుక్‌లో ఇంటరాక్షన్ సందర్భంగా స్టీవ్ స్మిత్ ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. భారత్‌లో టెస్ట్ సిరీస్ నెగ్గడం తన కల అని, రిటైర్మెంట్ ప్రకటించేలోగా సాధించి తీరాలనుందని చెప్పాడు. ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ విజయాలు ముఖ్యమేనన్నాడు. కానీ భారత్ లాంటి నెంబర్ వన్ జట్టుపై టెస్టు క్రికెట్ ఆడటం అంత తేలిక కాదన్నాడు.  సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

2017లో తన కెప్టెన్సీలో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమిని గుర్తు చేసుకున్నాడు. పుణేలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించగా.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరిన భారత్ మూడు వరుస టెస్టులు నెగ్గి 3-1తో ఆసీస్‌పై సిరీస్‌ను సొంతం చేసుకుందని చెప్పుకొచ్చాడు.  ఈ మెగాస్టార్ ఆ చిరంజీవికి ‘మెగా’ అభిమాని

ఆ సిరీస్‌లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జేడేజాలు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. అశ్విన్ 25 వికెట్లు పడగొట్టగా, జడేజా 21 వికెట్లతో సత్తాచాటాడు. భారత గడ్డపై జడేజా లాంటి స్పిన్నర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత తేలిక కాదని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. అతడు బంతిని రిలీజ్ చేసే తీరు ఒకే విధంగా ఉన్నా వైవిద్యభరితంగా దూసుకొస్తాయని తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

Trending News