దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు మిన్నంటుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాన్ బొల్సనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే దేశం, జాతీయత అనే అంశాలపై సత్వరమే స్పందించే మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Being a father of two daughters, it makes me feel proud to see a women leading men in the Republic Day Parade. Hats off Tania shergill, keep going! Happy Republic Day to all. #71stRepublicDay pic.twitter.com/D3WpCIUMw5
— Gautam Gambhir (@GautamGambhir) January 26, 2020
ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయిన ఓ విషయంలో గర్విస్తున్నట్లు తెలిపారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మగవారిని ఓ మహిళ లీడ్ చేయడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. తానియా షెర్గిల్కు హ్యాట్రాఫ్.. మీరు మరింత ముందుకు సాగాలి. ‘హ్యాపీ రిపబ్లిక్ డే’ అని ఆమె ఫొటో పోస్ట్ చేశారు. క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన గంభీర్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.