IPL 2021: ఆర్సీబీ బౌలర్ హర్షల్‌ పటేల్‌ నయా రికార్డు

ఐపీఎల్‌ 2021లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఓ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బ్రేవోతో పాటు అగ్రస్థానంలో నిలిచాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 10:56 AM IST
  • ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్
  • ఓ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు
  • బ్రేవో రికార్డు సమం చేసిన హర్షల్
IPL 2021: ఆర్సీబీ బౌలర్ హర్షల్‌ పటేల్‌ నయా రికార్డు

Harshal Patel: రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌(IPL 2021)లో  అరుదైన ఘనత సాధించాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌(Harshal Patel) రికార్డు సృష్టించాడు. మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్‌ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్‌ ఉండడం విశేషం. తద్వారా హర్షల్‌ పటేల్‌ సీఎస్‌కే బౌలర్‌ డ్వేన్‌ బ్రావో(Dwayne Bravo)తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.

డ్వేన్ బ్రావో 2013 ఐపీఎల్‌లో సీఎస్‌కే(CSK) తరపున ఆ సీజన్‌లో 32 వికెట్లు తీశాడు. హర్షల్‌ పటేల్‌, బ్రావోల తర్వాత  రెండో స్థానంలో కగిసో రబడ( ఢిల్లీ క్యాపిటల్స్‌, 30 వికెట్లు, ఐపీఎల్‌ 2020) ఉన్నాడు. ఇక జేమ్స్‌ ఫాల్కనర్‌ (28వికెట్లు, 2013 ఐపీఎల్‌), లసిత్‌ మలింగ (28 వికెట్లు, 2011 ఐపీఎల్‌), బుమ్రా( 27 వికెట్లు, ఐపీఎల్‌ 2020) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.

Also read: KKR vs RCB match highlights: బెంగళూరును ఓడించిన కోల్‌కతా..  కోహ్లీ సేన నడ్డి విరిచిన Sunil Narine

కాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(royal challengers bangalore) ఓటమిపాలైంది. దీంతో ఈసారి కూడా కప్పు గెలవకుండానే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. సోమవారం రాత్రి జరిగిన కీలక పోరులో కోహ్లీసేన 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News