Team India: రోహిత్ శర్మ వారసుడు రెడీ అవుతున్నాడు.. దూసుకువస్తున్న పాండ్యా

Rohit Sharma Vs Hardik Pandya: టీ20లకు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో హార్ధిక్ పాండ్యా తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. దీంతో వన్డేలకు డిప్యూటీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలో ఆసీస్‌తో జరిగే మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరం కానున్న నేపథ్యంలో తొలిసారి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 10:32 PM IST
Team India: రోహిత్ శర్మ వారసుడు రెడీ అవుతున్నాడు.. దూసుకువస్తున్న పాండ్యా

Rohit Sharma Vs Hardik Pandya: రెండుసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్.. మూడోసారి గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న విశ్వకప్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్‌ను అన్ని విధాలుగా రెడీ చేస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌లోనే వెనుదిరగడంతో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కప్‌ను ఒడసిపట్టాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ ప్రపంచ కప్ తరువాత రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ప్రచారం తెరపైకి వస్తోంది.

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత 35 ఏళ్ల రోహిత్ శర్మకు టీమిండియా వన్డే కెప్టెన్సీని కొనసాగించడం కష్టమేని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా భవిష్యత్‌లో వన్డేలకు సారథ్యం వహించే అవకాశం ఉందని అంటున్నారు. పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదే తన జట్టు గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కెప్టెన్సీ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. తనకు వచ్చిన అవకాశాన్ని పాండ్యా చక్కగా వినియోగించుకున్నాడు. 

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలి కనిపిస్తోంది. ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతూ.. నేనున్నాంటూ భరోసా ఇస్తున్నాడు. పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సంయమనంతో ఆడుతున్నాడు. అదేవిధంగా మొదటి ఓవర్ బౌలింగ్ చేస్తూ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో కూడా  పాండ్యాకు సాటి లేదు. హార్దిక్ పాండ్యా  టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌ అయితే.. మరో కపిల్ దేవ్‌ అవుతాడంటూ అందరూ పొగిడేస్తున్నారు. 

టీమిండియాకు సారథ్యం వహించే సత్తా హార్దిక్ పాండ్యాకు ఉంది. రోహిత్ శర్మ తర్వాత నలుగురు ఆటగాళ్లు భారత కెప్టెన్ రేసులో ఉన్నారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను గతంలో కెప్టెన్సీ పోటీదారులుగా పరిగణించారు. అయితే ఫామ్‌లో లేని కారణంగా కేఎల్ రాహుల్‌కు జట్టులో స్థానమే కష్టంగా మారింది. వైస్ కెప్టెన్సీ పదవి కూడా పోయింది. ఇక రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మరికొంత కాలం క్రికెట్‌కు దూరం కానున్నాడు. బుమ్రా తరచు గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కెప్టెన్సీ రేసులో హార్ధిక్ పాండ్యా ముందుండగా.. బీసీసీఐ కూడా అతడిని ప్రోత్సహిస్తోంది.

Also Read: Ram Charan Upasana: రామ్‌చరణ్‌ గురించి సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన.. దయచేసి అలా చేయకండి

Also Read: PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News