Harbhajan Vs Dhoni: 'ధోనీ మాత్రమే వరల్డ్ కప్ గెలిస్తే.. మిగతా ప్లేయర్స్ లస్సీ తాగేందుకు వెళ్లారా..?'

Harbhajan vs Dhoni: 2011లో టీమ్ ఇండియా వరల్డ్​ కప్​ గెలవడం విషయంలో అప్పటి కెప్టెన్​ ధోనీకి మాత్రమే క్రెడిట్ ఇవ్వడంపై మండిపడ్డాడు మాజీ క్రికెటర్​ హర్బజన్ సింగ్. అలాంటప్పుడు మిగతా ప్లేయర్స్​ ఏం చేసినట్టని ప్రశ్నించాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 01:13 PM IST
  • ధోనీపై హర్బజన్​ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • వరల్డ్​ కప్​ గెలిచిన విషయంలో క్రెడిట్​పై కామెంట్స్​
  • ధోనికి మాత్రమే క్రెడిట్ ఇవ్వడంపై ఆగ్రహం..
Harbhajan Vs Dhoni: 'ధోనీ మాత్రమే వరల్డ్ కప్ గెలిస్తే.. మిగతా ప్లేయర్స్ లస్సీ తాగేందుకు వెళ్లారా..?'

Harbhajan Vs Dhoni: టీమ్​ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2011లో టీమ్​ ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ఈ ఘనతను సాధించింది. దీనితో అప్పటి కెప్టెన్ ధోనీపై ప్రశంసల వర్షం కురిసింది. మాజీలు సహా ప్రముఖులు, సామాన్యులు టీమ్ ఇండియాను ఆకాశానికెత్తేశారు. అయితే ఈ విషయంలో ఎక్కువ క్రెడిట్ ధోనికి మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబట్టాడు బజ్జీ.

టీమ్ అంతా సమష్టిగా కృషి చేయడం వల్లే వరల్డ్ కప్ గెలవగలిగిందన్నాడు. అలాంటప్పుడు ధోనికి మాత్రమే క్రెడిట్ ఎందుకు ఇస్తున్నారు? అని ప్రశ్నించాడు. ధోనీ మాత్రమే కప్ గెలిస్తే మిగతా 10 మంది ప్లేయర్స్ అక్కడకు లస్సీ తాగేందుకు వెళ్లారా? అని అగ్రహం వ్యక్తం చేశాడు. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన గౌతమ్​ గంభీర్​ సహా మిగతా ప్లేయర్స్​ ఏం చేసినట్లు? అని వ్యాఖ్యానించాడు.

ఆస్ట్రేలియా నాలుగు సార్లు కప్పు గెలిస్తే టీమ్ గెలిచిందని చెప్పుకుంటారు. ఇండియా కప్ గెలిస్తే మాత్రం ధోనీకి క్రెడిట్ ఇస్తారా? అంటూ మండిపడ్డాడు బజ్జీ. ఒక టీమ్ గెలిచిందంటే అందులో ఆడిన వాళ్లందరి ప్రదర్శన, కష్టం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బజ్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవతున్నాయి.

Also read: CSK Innings: విధ్వంసకర ఇన్నింగ్స్ అంటే ఇదేనా, 60 బంతుల్లో 157 పరుగులా...ఎలా సాధ్యం

Also read: Moeen Ali Run Out: అద్భుత ఫీల్డింగ్‌తో మొయిన్ అలీని రనవుట్ చేసిన ప్రభుదేశాయ్, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News