Full list of unsold players in IPL Auction 2022 Day 1: బెంగళూరు వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం తొలిరోజు (ఫిబ్రవరి 12) ముగిసింది. వేలంలో కొందరి ఆటగాళ్లపై పలు ప్రాంఛైజీలు భారీ ధర వెచ్చించగా.. మరికొందరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇందులో స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మాజీ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఎన్నో ఏళ్లుగా జట్టుకు సేవలందించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతడిని కొనుక్కునేందుకు ముందుకు రాలేదు. ఇది చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే అంశం అని చెప్పాలి.
సురేష్ రైనా గతేడాది చెన్నై తరఫున పెద్దగా రాణించలేదు. ఒక హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. అంతకుముందు వరకూ ఏటా ప్రధాన ఆటగాడిగా రాణించినా.. చెన్నై ఈసారి అతడిని వదిలేసుకుంది. మెగా వేలంలో మళ్లీ కొనుగోలు చేస్తుందని అభిమానులు భావించారు. ఇతర జట్లు కూడా రైనా కోసం పోటీపడతాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ ఉల్ హసన్, దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్, ప్రొటీస్ వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలం తొలిరోజు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఉండడం విశేషం.
స్టీవ్ స్మిత్ ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతడిపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. షకిబ్‌ను సైతం ఎవరూ కొనుగోలు చేయలేదు. గతేడాది కోల్‌కతాలో ఆడినా పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు కూడా కొనుక్కునేందుకు ముందుకు రాలేదు. మిల్లర్ సైతం గతేడాది రాజస్థాన్ జట్టులో విఫలమవడంతో ఈసారి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. తాహిర్‌ను ఈసారి ఎవరూ కొనుగోలు చేయలేదు. వృద్ధిమాన్ సాహా, సామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా ఈ జాబితాలో ఉన్నారు. రెండో రోజు అయినా వీరిలో కొందరిపై ప్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయో చూడాలి.
తొలిరోజు అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్ వీరే:
1 సురేష్ రైనా
2 స్టీవ్ స్మిత్
3 షకిబ్ ఉల్ హసన్
4 డేవిడ్ మిల్లర్
5 ఇమ్రాన్ తాహిర్
6 వృద్ధిమాన్ సాహా
7 సామ్ బిల్లింగ్స్
8 ఉమేశ్ యాదవ్
9 అమిత్ మిశ్రా
10 రాజ్‌పత్ పాటిదార్
11 అన్‌మోల్ ప్రీత్ సింగ్
12 విష్ణు వినోద్
13 విష్ణు సోలంకీ
14 ఎన్ జగదీశన్
15 సిద్ధార్థ్ కౌల్
16 సందీప్ శర్మ
Also Read: IPL 2022 Auction: ముగిసిన ఐపీఎల్ 2022 తొలిరోజు వేలం.. టాప్ 10లో ఎవరున్నారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook