ప్రపంచ ప్రతిష్టాత్మక సాకర్ పోరులో సంగ్రామం అతి భీకరంగా సాగింది. లెజెండరీ జట్టు ఫ్రాన్స్ ముందు పసికూన క్రొయేషియా వెలవెలబోయింది. క్రొయేషియా డిఫెన్స్ ఆడుతూ బంతిని కదలకుండా చేస్తున్నా.. అనుభవం నిండిన ఫ్రాన్స్ జట్టు సభ్యుల ముందు వారి ఆటలేవీ సాగలేదు. మఖ్యంగా పోగ్బా, ఎంబపే లాంటి స్టార్ ఆటగాళ్లు క్రొయేషియాకి చుక్కలు చూపించారు. పోగ్బా 59వ నిమిషంలో గోల్ చేయగా.. ఎంబపె 65 నిమిషంలో గోల్ చేశాడు.
అంతకు ముందే గ్రెజిమన్ కూడా 38వ నిమిషంలో గోల్ చేసి ఫ్రాన్స్ ఖాతా తెరిచాడు. ప్రత్యర్థిని అయోమయంలోకి నెట్టే టెక్నిక్స్‌తో పాటు గోల్స్ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఫ్రాన్స్ ఆడిన తీరుకి క్రొయేషియా ఆటగాళ్లు విస్తుపోయారు. అయినా క్రొయేషియా జట్టులో ఇవాన్ పెర్సిక్ 28వ నిమిషంలో గోల్ చేయడంతో వారి శిబిరాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది.
అయితే గోల్ చేసిన ఆనందం క్రొయేషియాకి ఎక్కువ సేపు మిగలలేదు. ఆఖరిగా 69వ నిమిషంలో మరియు మండ్జుకిక్ మరో గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. 4-2 స్కోరుతో లీడింగ్ తీసుకున్న ఫ్రాన్స్ ప్రపంచ విజేతగా నిలిచింది. సాకర్ రారాజుగా మరోసారి ప్రూవ్ చేసుకుంది.