Harbhajan Singh - Covid-19: టీమిండియా మాజీ క్రికెటర్​​కు కరోనా.. రెండు సంవత్సరాలుగా తప్పించుకున్నా..!!

Harbhajan Singh Tests Positive For Covid 19. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్, వ్యాఖ్యాత హర్భజన్ సింగ్‌ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 03:01 PM IST
  • టీమిండియా మాజీ క్రికెటర్​​కు కరోనా
  • రెండు సంవత్సరాలుగా తప్పించుకున్నా
  • రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో హర్భజన్
 Harbhajan Singh - Covid-19: టీమిండియా మాజీ క్రికెటర్​​కు కరోనా.. రెండు సంవత్సరాలుగా తప్పించుకున్నా..!!

Harbhajan Singh Tests Positive For Covid 19: టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్, వ్యాఖ్యాత హర్భజన్ సింగ్‌ (Harbhajan Singh) కరోనా వైరస్ ( Covid 19) మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్​ వచ్చిందని హర్భజన్ ఈరోజు (జనవరి 21) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నట్లు భజ్జీ వెల్లడించారు. మరోవైపు హర్భజన్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ గీతా బస్రా కూడా కోవిడ్-19 బారిన పడ్డారు. 

'ఈరోజు నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ టెస్టు చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి కరోనా నిబంధలను పాటించండి' అని హర్భజన్ సింగ్‌ ట్వీట్ చేశారు.

Also Read: IND vs SA 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. సిరాజ్, సూర్యకు నిరాశే! టీమిండియాకు చావోరేవో!!

మరోవైపు తాను కోవిడ్-19 బారిన పడినట్టు హర్భజన్ సింగ్ సతీమణి గీతా బస్రా (Geeta Basra) కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. 'రెండు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉన్నాం. కరోనా బారిన పడకుండా ఎంత ప్రయత్నించినా.. చివరకు వైరస్ సోకింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని కోరుతున్నా' అని గీతా పేర్కొన్నారు. 

గత ఏడాది డిసెంబరు 24న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 41 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ తన కెరీర్​లో భారత్ (Team India) తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడారు. టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టిన భజ్జీ.. వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు తీశారు. ఇక ఐపీఎల్‌ (IPL)లోనూ 163 మ్యాచ్‌లాడిన హర్భజన్ 150 వికెట్లు పడగొట్టారు. 2016 నుంచి భారత్ జట్టుకి దూరంగా ఉండి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భజ్జీ.. పంజాబ్‌ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. 

Also Read: Shyam Singha Roy: నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఇంటికి పిలిచి మరీ ఇచ్చేశాడుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News