WTC Final 2023: 'ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ చేసే కోహ్లీ, పూజారాలను ఔట్ చేసింది'.. పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

WTC Final 2023, Ind vs Aus: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్లో  ఆసీస్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్తలు భగ్గుమన్నాయి. బాల్ ట్యాంపరింగ్ చేసి భారత కీలక ఆటగాళ్లను ఆస్ట్రేలియా జట్టు ఔట్ చేసిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆరోపించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2023, 12:38 PM IST
WTC Final 2023: 'ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ చేసే కోహ్లీ, పూజారాలను ఔట్ చేసింది'.. పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

Ball-Tampering WTC Final 2023: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ చేసి.. ఇద్దరు భారత్ స్టార్ ఆటగాళ్లను ఔట్ చేశారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కంగూరు జట్టు భారీ స్కోరు సాధిస్తే.. టీమిండియా మాత్రం తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది. ఈ క్రమంలో ఆసీస్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. బాల్ ట్యాంపరింగ్ చేసే ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీని ఆసీస్ అవుట్ చేసిందని అలీ ఆరోపించాడు. 

తొలి ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో కెమరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో చెతేశ్వర్‌ పుజారా అవుట్ కాగా..  19వ ఓవర్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్ లో  డ్యూక్స్ బాల్ ఉపయోగిస్తున్నా సంగతి తెలిసిందే. అయితే 14వ ఓవర్లో డ్యూక్ బాల్ రివర్స్ స్వింగ్ అవ్వడం దాదాపు అసాధ్యం. కానీ పూజారా అలాంటి డెలివరీకే ఔటయ్యాడు. మరోవైపు కోహ్లీ కూడా అనూహ్యమైన బౌన్స్‌ను ఊహించక పెవిలియన్ చేరాడు. 

Also Read: Free Streaming: జియో సినిమా తరహాలోనే ఐసీసీ ప్రపంచకప్, ఆసియా కప్ టోర్నీలు హాట్‌స్టార్‌లో ఫ్రీ స్ట్రీమింగ్

''ఈ మ్యాచ్ లో ఆసీసీ ఖచ్చితంగా బంతిని ట్యాంపరింగ్ చేసింది. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అసలు అంపైర్లు ఏం చేస్తున్నారు? భారత ఇన్నింగ్స్‌లో 16వ, 18వ ఓవర్లు బాల్ ట్యాంపరింగ్‌కు స్పష్టమైన రుజువు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో బంతి ఆకారం క్షీణించడంతో అంపైర్ సూచన మేరకు బంతిని మార్చారని'' అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. 
ఆసీస్ జట్టుపై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేం కాదు. 2018లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ గెలిచేందుకు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తదితరులు బాల్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. 

Also Read: Ind vs Aus Day 1 Highlights: ఇది నా స్టైల్.. వెరైటీగా డీఆర్ఎస్ కోరిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News