Parthiv Patel: టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట విషాదం...పార్థీవ్ పటేల్ తండ్రి కన్నుమూత

భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఇంట్లో విషాదం నెలకొంది. కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తండ్రి  హఠాత్తుగా ఆదివారం తుది శ్వాస విడిచారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2021, 03:20 PM IST
  • భారత మాజీ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం
  • పార్థీవ్ పటేల్ తండ్రి మృతి
  • ట్విట్టర్ లో భావోద్వేగ పోస్టు చేసిన పార్థీవ్
Parthiv Patel: టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట విషాదం...పార్థీవ్ పటేల్ తండ్రి కన్నుమూత

Parthiv Patel Father Passed Away: టీమిండియా మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. అతడి తండ్రి అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ (Ajaybhai Bipinchandra Patel) ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్‌ పటేల్‌(Parthiv Patel) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

‘''మా నాన్న అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ నేడు(సెప్టెంబరు 26) స్వర్గస్తులైనారని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు''’’అని అతడు ట్వీట్‌ చేశాడు. ఈ క్రమంలో.. మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా పార్థివ్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ ఆత్మకు శాంతి చేకూరాలని పార్థించారు. కొంతకాలంగా పార్థివ్ తండ్రి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం అహ్మదాబాద్‌(Ahmedabad)లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 

Also read: IPL 2021: సన్‌రైజర్స్‌కు షాక్‌.. తండ్రి మరణంతో ఇంటి దారి పట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌!

పార్థీవ్ కెరీర్..

అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు పార్థివ్‌ పటేల్‌(Parthiv Patel) గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ మొత్తంలో అత్యంత చిన్న వయస్సులోనే వికెట్‌ కీపర్‌(Wicket keeper)గా ఎదిగిన ఆటగాళ్లలో అతడిది తొలి స్థానం. ఇక టీమిండియా తరఫున పార్థివ్‌ 25 టెస్టుల్లో 934 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి. వికెట్‌ కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతడు 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x