Kapil Dev: కోలుకుంటున్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ 

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ( Kapil Dev)‌ (61) కు రెండురోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Last Updated : Oct 24, 2020, 02:41 PM IST
Kapil Dev: కోలుకుంటున్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ 

Chetan Sharma shares picture of Kapil Dev Pic: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ( Kapil Dev)‌ (61) కు రెండురోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీ (Delhi) ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. ఈ క్రమంలో కపిల్ దేవ్ ఆరోగ్యం కుదుట‌ప‌డింద‌ని, ఆయ‌న క్ర‌మంగా కోలుకుంటున్నారని మాజీ క్రికెట‌ర్, బీఎస్పీ నాయకుడు చేత‌న్ శ‌ర్మ (Chetan Sharma) తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన కపిల్ ఆసుప‌త్రిలో తన కూతురు ఆమ్యాతో ఉన్న ఫోటోని చేతన్ షేర్ చేశారు. ఈ ఫోటోలో క‌పిల్ రెండు చేతులతో థంబ్స‌ప్ సింబ‌ల్స్ చూపిస్తూ నవ్వుతూ కనిపించారు. 

మాజీ క్రికెట్ రథసారధి కపిల్‌ దేవ్‌కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత ఛాతిలో నొప్పి అని చెప్పిన వైద్యులు ఆ తర్వాత గుండెపోటు రావడంతో.. ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. కపిల్‌ను ఆసుపత్రి వైద్య బృందం 24గంటలపాటు పర్యవేక్షిస్తోంది. అయితే క‌పిల్ కోలుకుంటున్నారన్న వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న అభిమానులు, ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

Also Read : 1983 Cricket World Cup : భారత్ విశ్వవిజేతగా నిలిచిన మ్యాచ్‌ నుంచి ఆసక్తికరమైన అంశాలు

ఇదిలాఉంటే.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. 1983లో భారత్‌కు వన్డే ప్రపంచ కప్ అందించారు. దాదాపు ఆయన 16 ఏళ్లపాటు భారత క్రికెట్‌కు సేవలు అందించారు. 131 టెస్టులు, 225 వన్డేలలో టీమిండియాకు కపిల్ దేవ్ ప్రాతినిథ్యం వహించి భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ లేనంత పేరు ప్రఖ్యాతలను గడించారు. 

Also read: Kapil Dev Heart Attack: క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్.. సర్జరీ చేసిన వైద్యులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News