ENGW vs INDW: రాణించిన హర్మన్‌ప్రీత్, రేణుక... 23 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై వన్డే సిరీస్ కైవసం..

ENGW vs INDW, 2nd ODI: హార్మన్ తన బ్యాటింగ్ తో ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తే...మరోవైపు రేణుక సింగ్‌ ఇంగ్లాండ్ బ్యాటర్ల పనిపట్టింది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై సుదీర్ఘ కాలం తర్వాత భారత మహిళల జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2022, 10:03 AM IST
ENGW vs INDW: రాణించిన హర్మన్‌ప్రీత్, రేణుక... 23 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై వన్డే సిరీస్ కైవసం..

ENGW vs INDW, 2nd ODI: భారత మహిళల జట్టు 23 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో వన్డేల్లో హర్మన్ సేన్ ఇంగ్లాండ్ జట్టుపై 88 పరుగుల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. 1999 తర్వాత ఇంగ్లీష్ గడ్డపై వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ గెలవడంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur), రేణుకా సింగ్, స్మృతి మంధాన, హర్లీన్‌లు కీలకపాత్ర పోషించారు. 

టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ అమీ జోన్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ 8 పరుగుల వద్ద నిష్క్రమించగా..మరో వైపు ఓపెనర్ స్మృతి మంధాన 51 బంతుల్లో 40 పరుగులతో రాణించింది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్, హర్లీన్‌లు పోటాపోటీగా పరుగుల చేస్తూ.. స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. వీరిద్ధరూ నాలుగో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్లీన్‌ 58 బంతుల్లో 72 పరుగులు చేసి ఔట్ అయింది. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 

హర్లీన్‌ ఔటైనా తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది హర్మన్‌. సిక్సర్లు, ఫోర్లుతో స్కోరు బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి ఓవర్లో వరుసగా ఓ సిక్స్, మూడు ఫోర్లు కొట్టింది. మెుత్తంగా 143 పరుగులతో ఆజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో నాలుగు సిక్స్ లు, పద్దైనమిది ఫోర్లు ఉండటం విశేషం. హర్మన్‌ అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 పరుగులు చేసింది.  అనంతరం లక్ష్యచేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 245 పరుగులకే కుప్పకూలింది. రేణుక సింగ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టు వెన్నువిరిచింది. ఆ జట్లు బ్యాటర్లలో వ్యాట్‌ 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. 

Also Read: IND vs AUS: డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఇలా చేయాలి..సునీల్ గావస్కర్ సలహా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News