ICC Men's Test Rankings 2023: ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. బ్యాటర్ల విభాగంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఇప్పటి వరకు మెుదటి స్థానంలో ఉన్న ఆసీస్ బ్యాటర్ లబూషేన్ ను వెనుక్కినెట్టి తొలి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. లబూషేన్ 877 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. మరోవైపు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండు స్థానాలు ఎగబాకి 883 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రూట్ 887 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఇండియాపై సెంచరీ చేసిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంకుకు చేరుకున్నారు. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఐదో స్థానంలో ఉన్నాడు. నాలుగు స్థానాలు కోల్పోయిన స్టీవ్ స్మిత్ ఆరో ర్యాంకులో కొనసాగుతున్నాడు. రెండు స్థానాలు మెరుగుపరుచుకున్న ఉస్మాన్ ఖవాజా ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఇక టీమిండియా విషయానికొస్తే.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలోనూ, స్టార్ బ్యాటర్ కోహ్లీ 14వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. పూజారా 25, రహానే 36, శ్రేయస్ అయ్యర్ 37వ స్థానాల్లోనూ కొనసాగుతున్నారు.
బౌలర్ల ర్యాంకింగ్ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ 860 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జేమ్స్ అండర్సన్ 829 పాయింట్లతో రెండో స్థానంలోనూ, రబాడా 825 పాయింట్లతో మూడు స్థానంలోనూ ఉన్నారు. భారత్ స్టార్ బౌలర్ బుమ్రా ఎనిమిదో ర్యాంకుకు పడిపోయాడు. మరోవైపు బౌలర్ల జాబితాలో జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా జడేజా ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్ లో అశ్విన్ రెండు, అక్షర పటేల్ నాలుగో ర్యాంకుల్లో ఉన్నారు.
Also Read: Cricket Facts: పాక్ తరుఫున క్రికెట్ ఆడిన ముస్లింయేతర ప్లేయర్లు వీళ్లే..! ఆ ఆటగాడి పట్ల దారుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి