Eng vs Pak 1st T20I: ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్

England vs Pakistan T20I: క్రికెట్ మ్యాచుల్లో కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఐసీసీ పలు కొత్త నిబంధనలను ( ICC rules ) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Last Updated : Aug 30, 2020, 01:31 AM IST
Eng vs Pak 1st T20I: ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్

England vs Pakistan T20I: క్రికెట్ మ్యాచుల్లో కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఐసీసీ పలు కొత్త నిబంధనలను ( ICC rules ) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) పాటించడం, హైఫై ఇచ్చుకోకుండా ఉండటం లాంటివి ముఖ్యమైనవి కాగా.. బౌలర్లు బంతిపై ఉమ్మిని రుద్దకూడదు ( Saliva ban ) అనేది అతి ముఖ్యమైన నిబంధన. ఐసిసి విధించిన ఈ కఠిన నిబంధనను పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ బ్రేక్ చేశాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. Also read : Arjun Reddy: అర్జున్ రెడ్డి డైరెక్టర్ నుంచి కొత్త సినిమా

మహ్మద్ అమీర్ ( Mohammad Amir ) బౌలింగ్ చేసే సమయంలో అనేకసార్లు బంతిపై ఉమ్మిని రుద్దడం అక్కడి కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఐతే మహ్మద్ అమీర్‌ని అంపైర్లు హెచ్చరించడంతో ఆ తర్వాత అమీర్ మళ్లీ ఆ తప్పిదాన్ని రిపీట్ చేయలేదు. కానీ అప్పటికే కెమెరాలకు చిక్కిన అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలా బంతిపై ఉమ్మి రుద్దితే కరోనావైరస్ ( Coronavirus ) వ్యాపించే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే ఐసిసి ఈ నిబంధనను తీసుకొచ్చింది. Also read : Naga Chaitanya: నాగ్‌కి చైతూ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్

ఒకవేళ అలవాటులో పొరపాటుగా ఎవరైనా బౌలర్ బంతికి ఉమ్మి రుద్దితే.. తొలుత అతడిని హెచ్చరించాలని ఐసీసీ అంపైర్లకి సూచించింది. అలా ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లకి మించి ఐసిసి రూల్స్‌ని అతిక్రమిస్తే.. వారి జట్టుకి 5 పరుగులు కోత విధించే అవకాశం కూడా ఉంది. Also read : Suresh Raina: ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్న రైనా

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం :

Trending News