భారత్‌పై 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

భారత్‌పై 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

Last Updated : Jun 30, 2019, 11:55 PM IST
భారత్‌పై 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

ఎడ్జ్‌బాస్ట్‌: ఐసిసి ప్రపంచ కప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్ట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధించినట్టే. అయితే భారత్‌కు మాత్రం బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది. 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఆది నుంచి దూకుడుగానే ఆడిన ఆ జట్టు భారత్‌కు భారీ విజయ లక్ష్యాన్నే విధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కేవలం 306 పరుగులే చేసింది. దీంతో 31 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిచెందక తప్పలేదు. 

భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ 109 బంతుల్లో 102 పరుగులు చేసి స్కోర్ పెరగడానికి కృషిచేసినప్పటికీ అతడి సెంచరీకి ఫలితం లేకుండా పోయింది. తర్వాత విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 66 పరుగులు చేసి అర్థ శతకం సాధించాడు. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ వరుసగా అర్థ శతకం చేయడం ఇది ఐదోసారి కావడం విశేషం.

Trending News