Rishabh Pant Hundred: ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!

IND vs ENG 5th Test, Rishabh Pant breaks MS Dhoni’s 17 years record. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 2, 2022, 12:34 PM IST
  • ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్
  • క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు పంత్
  • 111 బంతుల్లో 146 పరుగులు
Rishabh Pant Hundred: ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!

Rishabh Pant breaks MS Dhoni’s 17 years record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. టాపార్డర్ విఫలమైన వేళ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అండతో రెచ్చిపోయిన పంత్.. 111 బంతుల్లో 20 ఫోర్లు, నాలుగు సిక్సులు సాయంతో 146 పరుగులు చేశాడు. పంత్, జడేజా ఆరో వికెట్‌కు 200లకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. తొలిరోజు ముగిసేసరికి భారత్  73 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. 

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. వన్డే తరహా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కేవలం 89 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌ ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. 2006లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మహీ 93 బంతుల్లోనే శతకం చేయాడు. ఈ రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. 

టెస్టుల్లో ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అనంతరం వృద్ధిమాన్ సాహాకు బీసీసీఐ చాలా అవకాశాలు ఇచ్చింది. అయితే అతడు స్థిరమైన ప్రదర్శన చేయకపోగా.. ఫిట్‌నెస్‌ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. దాంతో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు. ఆరంభంలో 2-3 మ్యాచుల్లో బాగానే ఆడిన అతడు ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు. మళ్లీ గాడిన పడిన పంత్.. బ్యాటింగ్, కీపింగ్‌లో అదరగొడుతున్నాడు. చివరి ఐదు ఇన్నింగుల్లో రెండు సెంచరీలు, ఒక 90 ప్లస్ స్కోర్ చేశాడు. 

Also Read: ENG vs IND: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సామ్‌ బిల్లింగ్స్‌.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!  

Also Read: LIGER: నగ్నంగా షాకిచ్చిన విజయ్ దేవరకొండ

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News