James Anderson removes Cheteshwar Pujara for most times in Test Cricket: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా నయావాల్, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా పూర్తిగా విఫలమయ్యాడు. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పుజారా 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పూజి ఔట్ అయ్యాడు. 46 బంతుల్లో 2 ఫోర్లతో 13 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు కౌంటీ క్రికెట్‌లో డబుల్ సెంచరీలతో సత్తాచాటిన పుజారా కీలక మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఈ ఔట్‌తో చతేశ్వర్ పుజారా తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అత్యధికసార్లు ఔటైన బ్యాటర్‌గా పుజారా నిలిచాడు. పూజారా ఇప్పటి వరకు 12 సార్లు అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. పుజారా తర్వాత పీటర్ పిడిల్ (11), డేవిడ్ వార్నర్ (10) ఉన్నారు. ఇదే ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లోని తొలి, రెండు, నాలుగో టెస్టులో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా పెవిలియన్ చేరాడు. అండర్సన్ స్వింగ్ బంతులు ఆడలేని పుజారా ఐదో టెస్టులోనూ మరోసారి బలయ్యాడు. ఈ సిరీస్‌లో అండర్సన్ బౌలింగ్‌లోనే పుజారా ఐదు సార్లు ఔటయ్యాడు.
చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పర్యటనలలో దారుణంగా విఫలమవడంతో.. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ క్రికెట్ ఆడిన పుజారా.. డబుల్ సెంచరీలతో చెలరేగాడు. దాంతో చివరి టెస్టుకు మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే కౌంటీ ఫామ్ ను మాత్రం ఈ మ్యాచులో కొనసాగించలేకపోయాడు. పుజారా భారత్ తరఫున 95 టెస్ట్ మ్యాచులు ఆడాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో శుబ్‌మన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13), హనుమ విహారి (20), విరాట్ కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) పూర్తిగా నిరాశపరచడంతో 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బీభరత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిషభ్ పంత్ (102 నాటౌట్), రవీంద్ర జడేజా (51 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టుబిగిస్తోంది.
Also Read: Rashi Khanna Pics: హద్దులు దాటేసిన రాశీ ఖన్నా.. దాచడానికి ఇంకేముంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook