IND vs ENG: రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన పుజారా.. 257 పరుగుల ఆధిక్యంలో భారత్‌! ఇక సిరీస్..

IND vs ENG: India lead by 257 runs in 5th Test. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టు (రీషెడ్యూల్ టెస్ట్‌)పై భారత్ పట్టుబిగించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 4, 2022, 08:06 AM IST
  • రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన పుజారా
  • 257 పరుగుల ఆధిక్యంలో భారత్‌
  • భారత్ విజయం లేదా డ్రా
IND vs ENG: రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన పుజారా.. 257 పరుగుల ఆధిక్యంలో భారత్‌! ఇక సిరీస్..

India lead by 257 runs in IND vs ENG 5th Test: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టు (రీషెడ్యూల్ టెస్ట్‌)పై భారత్ పట్టుబిగించింది. మొదటి ఇనింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. మూడో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా (50 బ్యాటింగ్‌; 139 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీ బాదాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ (30 బ్యాటింగ్‌; 46 బంతుల్లో 4×4) పుజారాకు మంచి సహకారం అందిస్తున్నాడు. చేతిలో ఇంకా ఏడు వికెట్లున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌కు భారత్ భారీ లక్ష్యాన్ని  నిర్దేశించనుంది. ఇప్పటికైతే భారత్ విజయం లేదా డ్రా చేసుకునే అవకాశం ఉంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 84/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 200 పరుగులు చేసి 284 వద్ద ఆలౌట్ అయింది. ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో (106; 140 బంతుల్లో 14×4, 2×6) సెంచరీ చేయగా.. బెన్‌ స్టోక్స్‌ (25), సామ్‌ బిల్లింగ్స్‌ (36) విలువైన రన్స్ చేశారు. విరాట్ కోహ్లీతో వాగ్వాదం అనంతరం బెయిర్‌స్టో రెచ్చిపోయి ఆడాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ 81 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. స్టోక్స్‌ ఔట్ అయినా బెయిర్‌స్టో వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 119 బంతుల్లో సెంచరీ చేశాడు. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. సిరాజ్‌ లోయరార్డర్‌ పని పట్టాడు. 

రెండో ఇనింగ్స్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్‌ గిల్‌ (4) ఔట్‌ అయ్యాడు. పుజారాతో కలిసి హనుమ విహారి (11) మరో వికెట్‌ పడనివ్వకున్నా పరుగులు రావడం కష్టమైంది. చివరకు బ్రాడ్‌ బౌలింగ్‌లో విహారి పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ (20) బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేసినా.. అంతలోనే ఔట్ అయ్యాడు. ఈ సమయంలో పుజారా, పంత్ మరో వికెట్‌ పడనివ్వలేదు. ఆచితూచి ఆడుతూ నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. దాంతో భారత్ కోలుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 257 పరుగులు. నాలుగో రోజు వేగంగా పరుగులు చేసి 400 టార్గెట్ ఇస్తే.. ఇంగ్లీష్ జట్టుకు గెలుపు అసాధ్యమే. 

సంక్షిప్త స్కోర్:
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416 (పంత్ 146, జడేజా 104; ఆండర్సన్ 5)
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284 (బెయిర్‌స్లో 106; సిరాజ్‌ 4, బుమ్రా 3)
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 125/3 (పుజారా 50, పంత్‌ 30; స్టోక్స్‌ 1)

Also Read: Horoscope Today July 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. నిరుద్యోగులు, ప్రేమిలకు శుభకాలం!

Also Read: Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్పుడు రిలీజంటే?  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News