Bhuvneshwar Inswinger: వాట్ ఏ బౌలింగ్ భువనేశ్వర్.. అద్భుత ఇన్‌స్వింగర్‌కు బిత్తరపోయిన బట్లర్‌!

ENG vs IND 1st T20, Jos Buttler out Bhuvneshwar Kumar's Inswinger. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బిత్తరపోయాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 8, 2022, 02:07 PM IST
  • వాట్ ఏ బౌలింగ్ భువనేశ్వర్
  • అద్భుత ఇన్‌స్వింగర్‌కు బిత్తరపోయిన బట్లర్‌
  • గోల్డెన్‌ డక్‌గా బట్లర్‌
Bhuvneshwar Inswinger: వాట్ ఏ బౌలింగ్ భువనేశ్వర్.. అద్భుత ఇన్‌స్వింగర్‌కు బిత్తరపోయిన బట్లర్‌!

Jos Buttler out Bhuvneshwar Kumar's Inswinger: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ టెస్ట్‌ మ్యాచులో అనూహ్యంగా ఓటమిపాలైన భారత్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం బోణి చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా గురువారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 51 పరుగులు, 4 వికెట్లు పడగొట్టిన ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బిత్తరపోయాడు. 

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్ల జాబితాను చూస్తే వారికి ఇదేమంత పెద్ద కాదని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కమ్ కెప్టెన్ జోస్‌ బట్లర్‌ క్రీజ్‌లో కుదురుకుంటే సునాయాసంగా ఇంగ్లీష్ జట్టు గెలుస్తనుందని క్రికెట్ ఫాన్స్ అంచనా వేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి ఓవర్‌లోనే భారీ షాక్‌ తగిలింది. 

జోస్ బట్లర్‌ను భువనేశ్వర్ కుమార్ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఐదో బంతిని భువీ ఇన్‌స్వింగర్‌గా సంధించగా.. బట్లర్‌ లెగ్ సైడ్ షాట్ ఆడబోయాడు. బంతి ఇంగ్లండ్ కెప్టెన్ బ్యాట్, ప్యాడ్ మధ్యలోంచి వెళ్లి లెగ్ వికెట్లను గిరాటేసింది. ఇంకేముంది బట్లర్ క్లీన్‌ బౌల్డయ్యాడు. భువీ విసిరినా ఇన్‌స్వింగర్‌కు బట్లర్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. మరోవైపు కీలక ప్లేయర్ ఔట్ అవ్వడంతో టీమిండియా ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. భువీ ఇన్‌స్వింగర్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

ఈ మ్యాచులో భువనేశ్వర్ కుమార్ మూడు ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. క్రీజ్‌లో జాసన్ రాయ్‌, జొస్ బట్లర్‌, డేవిడ్ మలాన్ వంటి హిట్టర్లను పెట్టుకొని కేవలం 4 రన్స్ ఇచ్చాడంటే భువీ ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడో ఇట్టే అర్థమయిపోతుంది.  ఇటవలి కాలంలో భువీ టీమిండియాకు మంచి ఆరంభాలు ఇస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2022లో కూడా భువనేశ్వర్ ఎంపిక కానున్నాడు. 

Also Read: Planet Shanti Remedy: శని గ్రహ కోపానికి గురికాకుండా ఉండాలంటే.. ఈ పొరపాట్లు చేయొద్దు!

Also Read: ఆషాఢ పూర్ణిమ రోజున స్నానం, దానం చేయండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News